భరత్ అనే నేను ట్రైలర్ రివ్యూ

0మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్ర ట్రైలర్ ఎప్పుడెప్పుడా అని యావత్ మహేష్ అభిమానులు ఎంతో ఆతృతగా నిన్నటి వరకు ఎదురుచూసారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం లో జరిగిన భరత్ బహిరంగ సభ లో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయడం జరిగింది.

ఎక్కువ అంచనాలు లేకుండా కథను రివీల్ చేసే అవకాశం ఇవ్వకుండా చాలా తెలివిగా కట్ చేసిన ట్రైలర్ తో దర్శకుడు కొరటాల శివ బాగానే ఇంప్రెస్ చేసాడు. పట్టభద్రుడిగా కాలేజీ నుంచి వాస్తవ ప్రపంచంలోకి వచ్చిన భరత్ అనూహ్య పరిణామాల్లో రాజకీయాల్లోకి వచ్చి ముఖ్య మంత్రి అవుతాడు. తప్పు చేయకూడదు అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మే భరత్ ఏదో మార్పు కోసం కొన్ని చేదు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. దీని వల్ల ప్రతిపక్షం స్వపక్షం నుంచే కాక బయట మీడియా పబ్లిక్ నుంచి కూడా ప్రశ్నలు ఎదురుకుంటాడు. అసలు భరత్ విజన్ ఏంటి దేని కోసం ఇంత ఛాలెంజ్ ఎదురుకున్నాడు అనేది భరత్ అనే నేను అసలు కథ.