అవును! నేను చాలామందితో డేటింగ్ చేశా: బాలీవుడ్ భామ భూమి

0Bhumi-Pednekarబాలీవుడ్ నటి భూమి పడ్నేకర్ తన వ్యక్తిగత జీవితంపై పలు విషయాలు వెల్లడించింది. తాను ఇండస్ట్రీలోకి రాకముందు చాలామందితో డేటింగ్ చేశానని పేర్కొంది. తానో మోడ్రన్ యువతినని పేర్కొన్న ఆమె, గతంలో చాలామందితో డేటింగ్ చేశానని వివరించింది. ప్రస్తుతం ఉన్న సంబంధాల గురించి భూమి మాట్లాడుతూ తాను ఒంటరినని, తాను ఎవరితోనూ పెద్దగా నటించలేదని, కాబట్టి రూమర్లకు అవకాశం లేదని కొట్టిపడేసింది. ప్రస్తుతం తాను పనినే పెళ్లి చేసుకున్నానంటూ అందరూ చెప్పే మాటలనే వల్లె వేసిందీ అమ్మడు.

భూమి ఇప్పటి వరకు చేసింది మూడు సినిమాలే అయినా రూమర్లు మాత్రం హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో స్పందించిన ఆమె.. తాను ఆయుష్‌మన్ ఖురానా, అక్షయ్ కుమార్‌లతో నటించానని, వారిద్దరికీ పెళ్లయి, సెటిలయ్యారు కాబట్టి వారితో తనకు లింకు పెట్టే అవకాశం లేదని చెప్పుకొచ్చింది.

గతంలో భూమి ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడలేదు. అయితే ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’, ‘శుభ్ మంగళ్ సావధాన్’ సినిమాల హిట్‌తో ఆమె వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల్లో ఉత్సుకత మొదలైంది. దీంతో ఆమె వ్యక్తిగత జీవితం గురించి అడిగినప్పుడు పై విధంగా స్పందించింది.