40 భూమిక 20ఏళ్ల కెరీర్

0అందాల భూమిక చావ్లా సుదీర్ఘమైన ఇన్నింగ్స్ గురించి తెలిసిందే. దాదాపు దశాబ్ధం పాటు టాలీవుడ్ లో అగ్రకథానాయికగా కెరీర్ ని సాగించింది. గ్లామర్ రోల్స్తో పాటు తన స్థాయికి తగ్గ పాత్రల్ని ఎంపిక చేసుకుంది. మిస్సమ్మ – అనసూయ లాంటి కథలు తనకోసమే పుట్టాయి అంటే అతిశయోక్తి కాదు. అభినయనేత్రిగా భూమిక అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే తన కెరీర్ పెళ్లి తర్వాత ఓలటైలిటీకి గురైన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం భూమిక రీఎంట్రీ ఇస్తున్న `యూటర్న్` మూవీ సెప్టెంబర్ 13న రిలీజ్ కి వస్తోంది. ఈ చిత్రంలో సమంతతో పాటు భూమిక పాత్ర సంథింగ్ స్పెషల్ గా ఉంటుందిట. ఇప్పటికి భూమిక 40 వయసు(21-08-1978 డి.ఓ.బి)కు చేరువైంది. అందుకే ఈ వయసుకు తగ్గట్టే తనకు 30- 40 రేంజు కథలు కావాలని నేరుగా మీడియా ఇంటర్వ్యూల్లోనే అడిగేయడం చర్చకొచ్చింది. వచ్చే ఏడాదికి రెండు దశాబ్ధాల కెరీర్ పూర్తవుతుందని భూమికనే స్వయంగా చెప్పింది.

ఈ వయసులో తనకు సూటయ్యే కథలు తీసుకురావాల్సిందిగా కోరుతోంది. తనకు ఇంకా నాయికా ప్రధాన చిత్రాలు చేసే ఆలోచన ఉంది. మిస్సమ్మ- అనసూయ లాంటివి కావాలనకుంటోంది. అయితే ఎందుకనో ఇటీవల మన దర్శకనిర్మాతలు పట్టించుకోవడం లేదు. ఇకపోతే తాజా పిలుపు మేరకు ఆ తరహా ఆలోచనలతో దర్శకరచయితలు తనని చేరుతారేమో చూడాలి. అంతేకాదు.. గ్లామర్ ఎలివేషన్ కి తనకు అడ్డేం లేదన్న సిగ్నల్స్ ని భూమిక ఇస్తున్నారు. మన దర్శకులు అలాంటి కథలు తెచ్చి ఒప్పించే సత్తా ఉండాలే కానీ నటన పరంగా అనవసర అడ్డంకులు సృష్టించుకోలేదని స్పష్టంగా తెలియజేయడం చర్చకొచ్చింది.