భూమి ఎందుకింత కఠినం?

0టాలీవుడ్ లో అగ్రకథానాయికగా రాజ్యమేలి భూమిక ఇటీవల తెరకు కాస్తంత బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే పొరుగు భాషల్లో భూమిక నటిస్తోందన్న ప్రచారం సాగింది. తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన యూటర్న్ చిత్రంతో తెలుగులో రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా ఈనెల 13న రిలీజవుతోంది. ఈ సందర్భంగా తాను ఎంతో ఎగ్జయిట్ మెంట్ కి గురవుతున్నానని భూమిక అన్నారు. హైదరాబాద్ లో జరిగిన పాత్రికేయ సమావేశంలో భూమిక మాట్లాడుతూ యూటర్న్ గురించి పలు ఆసక్తికర సంగతుల్ని తెలిపారు.

భూమిక మాట్లాడుతూ – ఇది వరకు నేను నటించిన సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో ఓ విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాను. ఆర్టిస్టు కొత్తగా వెరైటీ పాత్రల్లో చేస్తేనే సంతృప్తితో పాటు ఐడెంటిటీ దక్కుతుంది. నేను కన్నడ యు టర్న్ చూశాను. అందుకే తెలుగు వెర్షన్కి అంగీకరించా. ఈ చిత్రంలో నేను చేసిన పాత్ర వేరొక సినిమాలో చేయలేదు. రెస్పాన్స్ ఎలా ఉంటుందోనన్న ఎగ్జయిట్ మెంట్ ఉంది… అని తెలిపారు. నా పాత్ర నిడివి గురించి ఆలోచించలేదు. పాత్ర ఎంత ఉంది? అన్న దానికంటే ఎంత ఇంపాక్ట్ అనేదే ముఖ్యం. నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో అవకావాలొస్తే నటించేందుకు ఆసక్తిగా ఉన్నాను. ప్రస్తుతం మహిలా ప్రధాన చిత్రాలొస్తున్నాయి. అవి ఇంకా పెరగాల్సి ఉంది అని తెలిపింది.

సమంత గురించి చెబుతూ.. ఈగలో తన నటన చూశా. యూటర్న్ సెట్స్ లోనూ ఎంతో ఎనర్జీతో నటించడం చూశాను.. అని తెలిపింది అయితే తన పాత్ర ఇదీ అన్న మాటను మాత్రం భూమిక ఎక్కడా రివీల్ చేయలేదు. ఆ విషయంలో భూమిక అంత కఠినత్వం పాటించడం చర్చకొచ్చింది.