షరాన్ స్టోన్ ని తలపిస్తోంది!

0

మిస్సమ్మ – అనసూయ సినిమాలతో తనకంటూ ఓ బ్రాండ్ ఉందని నిరూపించిన భూమిక – ఇంకా తనలో ఫైర్ ఏమాత్రం తగ్గలేదని .. ఆ యాటిట్యూడ్ తనలో ఇంకా అలానే పొందిగ్గా ఉందని నిరూపిస్తున్నారు. యోగా గురూ భరత్ ఠాకూర్ ని పెళ్లాడి ఓ బిడ్డకు మమ్మీ అయ్యాక కూడా భూమికలో గ్లామ్ & గ్లిజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఇటీవలే టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటే ప్రయత్నంలో ఉన్నారు. మొన్ననే యూటర్న్ సినిమాలో ఓ ఉత్కంఠ పెంచే పాత్రతో రక్తి కట్టించారు.

ఈసారి అంతకుమించి.. అంటూ వస్తున్నారు ఈ సీనియర్ నాయిక. అక్కినేని నాగచైతన్య – నిధి అగర్వాల్ జంటగా నటించిన సవ్యసాచి చిత్రంలో భూమిక ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో భూమిక లుక్ సస్పెన్స్ ని పెంచింది. సవ్యసాచి త్వరలో రిలీజ్కి రానున్న వేళ తన సినిమాని భూమిక ఓ రేంజులో ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవలే రిలీజైన టీజర్ లోనూ భూమిక పాత్ర సంథింగ్ అన్న టాక్ వినిపించింది.

ఇకపోతే ఇదిగో భూమిక సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఈ డార్క్ షేడ్ ఫోటో మైండ్ బ్లోయింగ్ అన్న టాక్ వినిపిస్తోంది. రియల్లీ ఫెంటాస్టిక్ స్టిల్ ఇది. రగులుతున్న అగ్నిగోళంలా కనిపిస్తోంది మన మిస్సమ్మ. ఈ ఫోటోలో భూమిక హ్యాట్ ధరించి క్యాట్ ఉమెన్ ని తలపించింది. షరాన్ స్టోన్ `బేసిక్ ఇన్ స్టింక్ట్స్` స్టైల్ ని గుర్తు చేస్తోంది. షరాన్ లో ఉన్న గట్స్ భూమికలో ఉన్నాయన్న సందేహం కలుగుతోంది. ఈ ఫోటో మీనింగ్.. మన దర్శకరచయితల్లో భూమిక ట్యాలెంటును పెర్ ఫెక్ట్ లైన్ & లెంగ్త్ లో అంచనా వేసే దమ్ము లేదనే ఛాలెంజ్ గా భావించాల్సి ఉంటుంది. ఇంతకీ బేసిక్ ఇన్ స్టింక్ట్స్ తరహా కథతో వస్తే భూమిక మ్యాడమ్ నటిస్తారంటారా?
Please Read Disclaimer