బిగ్ బాస్ 2: ఎవరమ్మా ఈ కంటెస్టెంట్లు??

0శివ బాలాజీ.. ముమాయత్ ఖాన్.. హరితేజ.. పెద్దగా పాపులర్ స్టార్లు కాకపోయినా కూడా.. ఆ సమయానికి వీళ్ళకు బాగానే పేరుంది. అందుకే బిగ్ బాస్ లోకి వీరు అడుగుపెట్టగానే వెంటనే బాగా కనక్ట్ అయిపోయారు జనాలు. కాని ఈసారి బిగ్ బాస్ 2 విషయంలో మాత్రం కాస్త హైప్ తక్కువగా ఉందా అంటే.. ఈ కంటెస్టెంట్ల యాంగిల్లో చూసి మాత్రం అవుననే చెప్పాలి. అయితే వీరందరూ కూడా ఎక్కువగా సినిమా రిలేటెడ్ సెలబ్రిటీలే కాని.. ఎందుకో ఈసారి అంతగా కిక్కివ్వలేదు.

ఇప్పుడన్న కంటెస్టంట్లో తనీష్ అండ్ తేజస్వి మదివాడ మాత్రం కాస్త పాపులార్టీ ఉన్న తారలుగా చెప్పాలి. పాటలు పాడే గీతా మాధురి.. విలన్ రోల్స్ చేసే అమిత్ తివారి.. టివి9 యాంకర్ దీప్తి నల్లమోతు.. డిబేట్లు చేసే బాబు గోగినేని.. వీరి వరకు కూడా పర్లేదనే చెప్పాలి. అయితే తక్కిన కంటెస్టంట్లు మాత్రం జనాలకు అంతగా సుపరిచితం కాదు. జూనియర్ ఆర్టిస్ట్ కమ్ డ్యాన్సర్ భాను శ్రీ.. రాప్ గాయకుడు రోల్ రిదా.. యాంకర్ శ్యామల.. నటుడు కిరీటి దామరాజు.. ఇనస్టాగ్రామ్ బ్యూటి దీప్తి సునయన.. నటుడు కౌశల్.. నటుడు సామ్రాట్ రెడ్డి.. ఒక చిన్న RJ గణేష్.. విజయవాడ మోడల్ సంజనా అన్నే.. మరియు వైజాగ్ బిజినెస్ మ్యాన్ నూతన్ నాయుడు.. ఇలా లిస్టు పెద్దగానే ఉంది. వీరిలో చాలామంది ఎవ్వరికీ తెలియనివారు కాగా.. ఎందుకో అందరూ పెద్దగా యాక్టివ్ గా కూడా లేరు.

ఒక ప్రక్కన బిగ్ బాస్ 1 లో గెలిచిన శివ బాలాజీ నుండి బాగా పాపులార్టీ తెచ్చుకున్న చాలామంది వరకు.. ఎవ్వరూ ఎక్కడా ఏ సినిమాల్లోనూ కనిపించట్లేదు. అలాంటి సమయంలో బిగ్ బాస్ 2 కంటెస్టంట్లు కాసింత పాపులార్టీ లేనివారైతే ఎలా? సరే..మున్ముందు ఈ కార్యక్రమంలో ఏమన్నా భారీగా కాంట్రోవర్శీలు జరిగితే మాత్రం.. సీన్ అంతా మారిపోతుంది. లెటజ్ సీ!!