కీలకమైన రియాలిటీ షోలో యాంకర్ గా హరితేజ!

0hariteja-big-bossబిగ్‌బాస్ రియాలిటీ షో ముగిసిన తర్వాత హరితేజ కెరీర్‌ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోతున్నది. అంతకుముందు చిన్న చిన్న పాత్రలకే పరిమితమైన హరితేజ ఇప్పడు టెలివిజన్, సినిమా రంగాల్లో హాట్ సెలబ్రిటీగా మారింది. గతంలో ఎంత ప్రయత్నించినా దక్కని క్రెడిట్ ఒక్కసారిగా బిగ్‌బాస్‌తో వచ్చింది. ప్రస్తుతం టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్ల కెరీర్‌కు హరితేజ ముప్పుగా మారిందనే మాట బలంగా వినిపిస్తున్నది. హరితేజ ప్రతిభాపాటవాలకు, క్రేజ్‌కు మెచ్చి ఆమెకు ఓ కీలకమైన రియాలిటీ షో బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తున్నది.

బిగ్‌బాస్‌ హౌస్‌లో హరితేజ ప్రతిభను పసిగట్టిన కొందరు నిర్మాతలు, టెలివిజన్ నిర్వాహకులు ఇటీవల ఆమెను కలువడం జరిగిందట. అయితే ఆఫర్లు కుప్పలు తెప్పలుగా వస్తున్నా గానీ హరితేజ ఆచితూచీ వ్యవహరిస్తున్నారనేది తాజా సమాచారం. దాదాపు రెండున్నర నెలలు కుటుంబ సభ్యులకు దూరమైన హరితేజ వారితో విలువైన సమయాన్ని గడుపుతున్నదట. అంతేకాకుండా ఓ పక్క చేయబోయే ప్రాజెక్టుల గురించి కూడా పక్కా ప్రణాళిక రచిస్తున్నారట.

ఇక బిగ్‌బాస్ అనంతరం ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో మల్లెమాల ప్రొడక్షన్ నిర్వాహస్తున్న ఓ షోకు హరితేజను యాంకర్‌గా తీసుకొన్నారట. మల్లెమాల నిర్మాణ విలువలు, వారు రూపొందించిన ప్రాజెక్టులకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి ఒకే చెప్పినట్టు తెలుస్తున్నది.