మరో బిగ్ బాస్ జంట పెళ్లి

0

బిగ్ బాస్ షో ద్వారా పరిచయం అయ్యి ఆ తర్వాత ప్రేమికులుగా మారిన పర్లే మానీ మరియు శ్రీనిష్ అరవింద్ ల వివాహం తాజాగా జరిగింది. వీరిద్దరు మలయాళ బిగ్ బాస్ షో లో ఉన్న సమయంలో ప్రేమించుకున్నారు. వీరిద్దరి స్నేహం మరియు ప్రేమ గురించి షో జరుగుతున్న సమయంలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి. టీఆర్పీ రేటింగ్ కోసం ఇద్దరి ప్రేమ రక్తి కటిస్తున్నారని అది అంతా కూడా ఫేక్ ప్రేమ అంటూ కొందరు అనుకున్నారు. అయితే తాజాగా వారిది ఫేక్ ప్రేమ కాదు నిజమైన ప్రేమ అని నిరూపితం అయ్యింది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇద్దరు చాలా ప్రేమగా ఉండటంతో పాటు తాజాగా పెళ్లి కూడా చేసుకున్నారు.

కేరళలోని నిదుంబసెరిలోని ఒక చర్చ్ లో వీరి పెళ్లి జరిగింది. పర్లే మానీ క్రిస్టియన్ అవ్వడంతో మొదట క్రిస్టియన్ పద్దతిలో వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. రిసెప్షన్ కు మళయాల స్టార్ మమ్ముటీతో పాటు పలువురు స్టార్స్ హాజరు అయ్యారు. ఈ సందర్బంగా వధు వరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక అబ్బాయి శ్రీనిష్ అరవింద్ హిందూ మతస్థుడు అవ్వడం వల్ల మే 8వ తారీకున ఇరు కుటుంబాల సమక్షంలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరుగబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. పర్లే మానీ మరియు శ్రీనిష్ లు ఇద్దరు కూడా వెండి తెరపైనే కాకుండా మలయాళ బుల్లి తెరపై చాలా కాలంగా రాణిస్తున్నారు. వీరిద్దరు బిగ్ బాస్ లో పార్టిసిపెంట్ చేయడంతో వీరిద్దరి గుర్తింపు డబుల్ అయ్యింది. ప్రస్తుతం వీరిద్దరు కూడా కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్నారు. ఈ సమయంలోనే వారి ప్రేమను పెళ్లి పీఠల వరకు నడిపించారు.
Please Read Disclaimer