బిగ్ బాస్ 2 బ్యాచ్ ఇదేనా ?

0నాని హోస్ట్ గా కొత్త అవతారం ఎత్తుతున్న బిగ్ బాస్ సీజన్ 2కు రంగం సిద్ధం అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ గా షో రన్ చేసాక యాంకర్ గా ఎవరు వస్తారా అనే సందిగ్దత చాలా కాలం నెలకొన్న నేపథ్యంలో దాన్ని బ్రేక్ చేస్తూ నాని లైన్ లోకి వచ్చాడు. ఇప్పుడు పార్టిసిపెంట్స్ మీద అందరి దృష్టి నిలుస్తోంది. అధికారికంగా కాదు కాని లీక్స్ రూపంలో పేర్లు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. మొదటి పేరే షాక్ ఇచ్చేలా ఉండటం గమనార్హం. తను ఎవరో కాదు. శ్రీరెడ్డినే. నానిని పేరు ప్రస్తావించకుండా ఇన్ డైరెక్ట్ గా ఫేస్ బుక్ లో కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి రావడం అంటే అనుమానించాల్సిన విషయమే. అప్పుడు నాని స్పందించకపోయినా తన దృష్టిలో జరిగిన విషయం ఉండే ఉంటుంది కనక ఫైనల్ చేయటం సాధ్యపడకపోవచ్చు. సింగర్ గీతామాధురిని సంప్రదించగా సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. యాంకర్ శ్యామల పేరు కూడా ఓకే అయినట్టు సమాచారం.

పవన్ కళ్యాణ్-బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సరసన నటించిన నిన్నటి తరం హీరోయిన్ రాశి ఈ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చారు కానీ లంక సినిమా అంతగా ఫలితాన్ని ఇవ్వలేదు. ఆవిడ కూడా పాజిటివ్ గా ఉన్నట్టు టాక్. మరో యాంకర్ లాస్య కూడా సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. జూనియర్ ఎన్టీఆర్ రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ లో నటించిన హీరోయిన్ గజలా కూడా రేస్ లో ఉన్నారట. ఆన్ లైన్ స్టార్ గా గుర్తింపు ఉన్న చాందిని చౌదరితో పాటు ప్రభాస్ డెబ్యూ మూవీ హీరోయిన్ శ్రీదేవిని కూడా ఒప్పించినట్టు టాక్ ఉంది. హీరోయిన్ స్నేహితురాలిగా చిన్న బడ్జెట్ సినిమాల్లో హీరోయిన్ గా మంచి పేరున్న ధన్య బాలకృష్ణను కూడా లిస్ట్ కూడా చేర్చినట్టు తెలిసింది. నిన్నటి తరం యూత్ హీరోలు వరుణ్-వరుణ్ సందేశ్-ఆర్యన్ రాజేష్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇవి అఫీషియల్ గా ప్రకటించనప్పటికీ సంప్రదించిన మాట వాస్తవమే అని తెలిసింది. మరి ఫైనల్ గా ఎవరు ఉంటారో ఎవరు పోటీ పడతారో తెలియాలంటే ఇంకొక్క రెండు వారాలు ఆగాల్సిందే