బిగ్ బాస్ 2 ఎపిసోడ్‌ 4: బాబూ గోగినేని.. నో మసాజ్, నో ఫ్యాషన్ షో

0బిగ్ బాస్ సీజన్ 2లో నాలుగో ఎపిసోడ్‌కి వచ్చేసరికి మెల్లగా రచ్చ మొదలైంది. ఒకవైపు ‘చెప్పండి ప్రభు’ లగ్జరీ బడ్జెట్ టాస్క్ యజమానులు, సేవకుల మధ్య రంజుగా సాగుతుండగా.. మరో వైపు తొలి ఎలిమినేషన్ జోన్‌కి డేంజర్ బెల్స్ మోగడంతో బిగ్ బాస్ హౌస్‌ను వీడే తొలి సెలబ్రిటీ ఎవరు? లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో గెలిచేది ఎవరు? అనే ఆసక్తికర అంశాలతో బుధవారం నాడు బిగ్ బాస్ సీజన్ 2 ఎపిసోడ్ 4 ప్రారంభమైంది.

బుధవారం నాటి ఎపిసోడ్ తేజస్విని, గీతా మాధురి మధ్య చిన్న వివాదంతో మొదలైంది. మరోవైపు బిగ్ బాస్ జైలు నుండి విడుదలైన సంజనా.. స్విమ్మింగ్ ఫూల్‌లో జలకాలు ఆడుతూ ఫ్యాషన్ షో పెర్ఫామెన్స్ కానిచ్చింది. ఇక కౌశల్.. భాను శ్రీతో బాడీ మసాజ్ చేయించుకోవడం నాట్ కరెక్ట్ అంటూ తేజస్వి చెప్పడంతో ఫైర్ అయ్యారు కౌశల్. ఇక సంజనా కూడా కౌశల్‌ అభిప్రాయంతో ఏకీభవించడంతో యజమానుల్లోని రెండు గ్రూపులుగా ఏర్పడ్డారు.

ఇక టాస్క్‌లో భాగంగా సంజనా, కౌశల్‌లు సేవకులందరూ ఆడవాళ్లు మగవాళ్లలాగ, మగవాళ్ల ఆడవాళ్ల లాగ వేశాలలు వేయాలంటూ ‘జంబలకిడి పంబ’ టాస్క్ ఇచ్చారు. ఈ జంబలకిడి పంబ కాన్సెప్ట్‌లో భాగంగా మొదటి పరిచయ కార్యక్రమాలు జరిగాయి. నేను అనైతికం నేను ఫ్యాషన్‌ షోలో పార్టిసిపేట్ చేయను నా బాడీని వేరే వాళ్లకు చూపించడం అనైతికంగా నేను భావిస్తున్నాను అందుకే నేను ఈ ‘జంబలకిడి పంబ’ టాస్క్ చేయను అంటూ కుండ బద్దలు కొట్టేశారు బాబుగోగినేని.

ఇక మిగిలిన సేవకుల కంటెస్టెంట్స్ ‘జంబలకిడి పంబ’ టాస్క్‌లో రెచ్చిపోయి పెర్ఫామెన్స్ చేశారు. ముఖ్యంగా రోల్ రైడా చీరకట్టి పెదాలకు లిప్ స్టిక్ పెట్టి వయ్యారాలు ఒలకపోసాడు. అలానే నూతన్ నాయుడు విశాలచ్చిమిగా ఇరగదీసే పెర్ఫామెన్స్ ఇచ్చారు. దీంతో నూతన్ నాయుడినే బెస్ట్ పెర్ఫామర్‌గా ఎంపిక చేశారు యజమానులు.