నెట్‌లో చక్కర్లు కొడుతున్న బిపాస ముద్దు

0Bipasha-Basu-and-Karan-Singబాలీవుడ్ భామ బిపాస బసు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను గత ఏడాది పెళ్లి చేసుకున్న ఈ చిన్నది సినిమాలకి కొద్దిగా దూరమైనా అభిమానులతో మాత్రం టచ్‌లోనే ఉంటోంది. ఈ జంట ఇప్పుడు బాలీవుడ్‌లోనే హాట్ జంటగా పేరు సంపాదించుకుంది. తాజాగా కరణ్ సింగ్ బర్త్ డే వేడుకల్ని బిపాస ప్రత్యేకంగా నిర్వహించిందట. కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ పార్టీతో కరణ్‌ని మెప్పించిన బిపాస చివరిగా ఘాటు ముద్దుతో శుభాకాంక్షలు చెప్పిందట.

ప్రస్తుతం ఈ గాఢ చుంబనం ఫొటో నెట్‌లో చక్కర్లు కొడుతోంది. పెళ్లి తర్వాత జరిగిన తొలి పుట్టిన రోజు కావడంతో బిపాస చాలా శ్రద్ధ తీసుకుని ఈ వేడుక నిర్వహించినట్లు సన్నిహితులు చెప్తున్నారు. గతంలో చాలా మంది బాలీవుడ్ హీరోలతో ప్రేమాయణం సాగించి బిపాస చివరకు కరణ్‌ను ప్రేమించి గత ఏడాది మే నెలలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.