రవితేజ కోసం జాతీయ అవార్డు గ్రహీత

0

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ‘ఒక్క క్షణం’ చిత్రాలతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న విఐ ఆనంద్ ప్రస్తుతం రవితేజతో సినిమాకు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెల్సిందే. రవితేజ – శ్రీనువైట్ల కాంబోలో తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం విడుదలైన వెంటనే ఆనంద్ తన సినిమాను మొదలు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రంకు డిస్కోరాజా అనే టైటిల్ ను అనుకుంటున్నారట. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్ మరియు కీలక పాత్రలకు నటీనటులను ఎంపిక చేయడం జరిగిపోయింది.

రవితేజకు జోడీగా నభా నటేష్ మరియు పాయల్ రాజ్ పూత్ లను ఎంపిక చేసిన ఆనంద్ తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహాను ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. తమిళంలో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా తనదైన శైలిలో దూసుకు పోతున్న బాబీ సింహా అక్కడ మంచి పేరు దక్కించుకున్నాడు. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలు సార్లు పలకరించిన బాబీ సింహా ఈసారి డైరెక్ట్ గా రవితేజతో కలిసి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తమిళంలో సిద్దార్థతో కలిసి నటించిన ‘జిగర్ తండా’ చిత్రంతో బాబీ సింహా జాతీయ అవార్డును అందుకున్నాడు. అప్పటి నుండి కూడా ఈయనకు వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్న బాబీ సింహాకు ఇక్కడ ఎలాంటి ఫలితం దక్కబోతుందో చూడాలి.




Please Read Disclaimer