గుండెపోటుతో న‌టుడి మృతి

0actor-inder-kumarబాలీవుడ్ న‌టుడు ఇంద‌ర్ కుమార్(45) ఈ రోజు తెల్ల‌వారు జామున 2గం.ల‌కు గుండె పోటుతో క‌న్నుమూశాడు. స‌ల్మాన్ ఖాన్ వాంటెడ్ చిత్రంతో బాగా ఫేమ‌స్ అయిన ఇంద‌ర్ కుమార్ ఆ త‌ర్వాత దాదాపు 20 చిత్రాల‌కి పైగా చేశాడు. భాఘీ, హ‌థ్యార్, మా తుజే స‌లామ్, అగ్నిప‌థ్‌, తుమ్ కో నా భూల్ పాయేంగే వంటి చిత్రాల‌లో న‌టించి మెప్పించాడు. తాజాగా ప‌టి పెయిడ్ హై యార్ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ తెల్ల‌వారు జామున ఆక‌స్మాత్తుగా గుండె పోటు రావ‌డంతో ముంబైలోని అంథేరిలో ఉన్న త‌న ఇంట్లో క‌న్ను మూశాడు ఇంద‌ర్ .ఆయ‌న మృతికి బాలీవుడ్ సెల‌బ్రిటీలు సంతాపం ప్ర‌క‌టించారు. కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి కూడా తెలిపారు. ఇంద‌ర్ కుమార్ అంత్య‌క్రియ‌లు ఈ రోజు సాయంత్రం 4గం.ల‌కు యారి రోడ్ స్మ‌శాన్ భూమిలో జ‌ర‌గ‌నున్నాయి.