ఆ హీరో చేతిలో కాజల్ మోసపోయిందట..!

0kajal-agarwal-hotకేవలం టాలీవుడ్లో లోనే కాదు సౌత్ సూపర్ బ్యూటీ కాజల్ సరిగ్గా పని అయిపోయింది అనుకుంటున్న టైంలో మళ్లీ ఫాంలోకి వచ్చినట్టు కనబడుతుంది. కెరియర్ అటు ఇటుగా ఉంది అనుకుంటున్న టైంలో రీసెంట్ గా చేసిన పక్కా లోకల్ సాంగ్ కేక పెట్టించేసింది. కాజల్ లో పరువాలన్ని ఆ సాంగ్లో గుమ్మరించేసి క్రేజ్ సంపాదించింది. అయితే కెరియర్ మంచి ఊపులో ఉన్న టైంలో బాలీవుడ్ లో కూడా తన లక్ టెస్ట్ చేసుకున్న కాజల్ అక్కడ షాహిద్ చేతిలో మోసపోయిందట.

షాహిద్, కాజల్ హీరో హీరోయిన్స్ గా ఓ సినిమా ఓకే అవగా ఆ మూవీ ప్రొడక్షన్ టైంలో షాహిద్ తో క్లోజ్ అయ్యిందట కాజల్. ఇక తన లక్సరియస్ కార్ లో షాహిద్ తో పట్టపగ్గాలు లేకుండా తిరిగేసిందట. తీరా ఆ సినిమా కొన్ని అనివార్య కారాణాల వల్ల ఆగిపోవడంతో మళ్లీ సౌత్ బాటే పట్టింది. అయితే సినిమా ఆగిపోయిన క్షణం నుండి షాహిద్ ఆమెతో రిలేషన్ కట్ చేసేశాడట. కనీసం ఫోన్ లో కూడా ఆమెను పలుకరించలేదు అని బాధపడుతుంది కాజల్. మరి బీ టౌన్ కల్చర్ గురించి అమ్మడి ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. సినిమా చేస్తున్నంత సేపే అక్కడ రాసుకు పూసుకు తిరగడం వన్స్ సినిమా అయిపోతే మళ్లీ తర్వాత సినిమాతో కెమిస్ట్రీ రన్ చేస్తారు. ఇదంతా తెలుసుకునేసరికి కాజల్ కు కాస్త టైం పట్టింది అంతే.