ప్రభాస్ కోసం బాలీవుడ్ హీరోయిన్లు

0Prabhas-next-filmరెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్యే యంగ్ డైరెక్టర్, ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ సింగ్ దర్శకత్వంలో ఒక సినిమాని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న కొత్త చిత్రం కావడంతో సినిమా ఎలా ఉండబోతోంది, బాహుబలితో ప్రభాస్ సాధించిన స్టార్ డమ్ ను సుజీత్ ఎలా హ్యాండిల్ చేయబోతున్నాడు, అసలు కథేంటి అనే ఆసక్తి ప్రేక్షకులు, అభిమానుల్లో మొదలైంది. వీటన్నింటికన్నా ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఎవరు చేస్తారు అనేది అందరినీ ఉత్కంఠకు గురిచేస్తున్న ప్రశ్న.

ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా రూపొందిస్తున్నారు. ప్రభాస్ బాహుబలితో హిందీలో బాగా పాపులర్ అవడంతో అక్కడి మార్కెట్ మీద ఎక్కువగా దృష్టి పెట్టిన టీమ్ అదనపు బలం కోసం బాలీవుడ్ హీరోయిన్ నే ప్రాజెక్ట్ లోకి తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. అందుకోసం కొందరు టాప్ హీరోయిన్ల పేర్లు ఇప్పటికే పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రం యొక్క షూటింగ్ మార్చి నుండి మొదలుకానుంది. సంగీత దర్శకుల త్రయం శంకర్, ఇహసాన్, లోయ్ లు సంగీతం అందించనున్న ఈ చిత్రానికి ‘శ్రీమంతుడు, ఘాజి’ ఫేమ్ మది సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.