మనోళ్ల కు బాలీవుడ్ స్టార్ల కితాబు

0

మన క్రేజీ స్టార్లతో బాలీవుడ్ స్టార్ల సత్సంబంధాలు ఇటీవల హాట్ టాపిక్. ఇప్పుడున్న మన టాప్ హీరోలంతా ఉత్తరాదిన స్టార్ హీరోలతో సాన్నిహిత్యం మెయింటెయిన్ చేస్తున్నారు. అది ఏఎన్నార్- ఎన్టీఆర్ రోజుల నుంచి ఉన్నదే అయినా- ఇటీవలి కాలంలో మరింతగా పెరిగింది. సీనియర్ హీరోల్లో చిరంజీవి- వెంకటేష్- నాగార్జున- బాలకృష్ణ వంటి స్టార్లు బాలీవుడ్ స్టార్లు- బాలీవుడ్ దర్శకనిర్మాతలతో సాన్నిహిత్యాన్ని మెయింటెయిన్ చేశారు. దాని వల్ల వీళ్లకు ఉత్తరాదినా అంతో ఇంతో గుర్తింపు దక్కింది. మంచి స్నేహ సంబంధాలు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ సహకరిస్తాయనడంలో సందేహం లేదు. మన తెలుగు స్టార్లు నటించిన సినిమాల్ని బాలీవుడ్ స్టార్లు రీమేక్ చేయడం అలాగే బాలీవుడ్ సినిమాల్ని మన తెలుగు స్టార్లు రీమేక్ చేయడం లాంటి రిలేషన్ వల్లా స్నేహాలు పెరుగుతున్నాయ్.

ఇది మంచి పరిణామమే. దానిని ఇప్పుడున్న టాప్ స్టార్లు మహేష్- ఎన్టీఆర్- చరణ్- ప్రభాస్- అల్లు అర్జున్- నాగచైతన్య- అఖిల్- దేవరకొండ లాంటి స్టార్లు మెయింటెయిన్ చేయడం చర్చనీయాంశమే. రామ్ చరణ్ సల్మాన్ భాయ్ కి ఎంతో సన్నిహితుడు. పలువురు ఉత్తరాది స్టార్లు డైరెక్టర్లతోనూ చనువుగా ఉంటాడు. అప్పట్లో అపూర్వ లఖియా దర్శకత్వంలో జంజీర్ అనే బాలీవుడ్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మెగాస్టార్ చిరంజీవి- చరణ్ వంటి స్టార్ల గురించి మాట్లాడతాడు. మెగా ఇంట ఆతిధ్యానికి వెళుతుంటాడు. బిగ్ బి ఫ్యామిలీతోనూ మెగా కాంపౌండ్ అనుబంధం గురించి చెప్పాల్సిన పనేలేదు.

ఇక సూపర్ స్టార్ మహేష్ సైతం బాలీవుడ్లో టాప్ రేంజు స్నేహాలు మెయింటెయిన్ చేస్తున్నారు. ఖాన్ భాయ్ లతో పాటు ఇటు యువహీరోలు రణవీర్ సింగ్ వంటి వారితోనూ అతడు కమర్షియల్ ప్రకటనల్లో నటించడం ఆ స్నేహాలు కొనసాగించడం హాట్ టాపిక్. ఇక అల్లు అర్జున్ డ్యాన్సులకు బాలీవుడ్ లో నూ వీరాభిమానులున్నారు. అతడి ప్రతిభ గురించి తాజాగా కింగ్ ఖాన్ షారూక్ పొగిడేయడం చూస్తుంటే ఎంతగా ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల హైదరాబాద్లో జీరో ప్రమోషన్స్ లో పాల్గొన్న షారూక్ బన్ని గురించి ప్రస్థావిస్తూ బన్ని స్వీట్ పర్సన్.. ఎక్స్ట్రీమ్ లీ ట్యాలెంటెడ్.. అంటూ పొగిడేశారు. ఇక అల్లు అరవింద్- అల్లు అర్జున్ ద్వయానికి అమీర్ ఖాన్ వంటి టాప్ స్టార్ తో రిలేషన్ ఉంది. అప్పట్లో గజిని నిర్మించిన అల్లు అరవింద్ అంటే అమీర్ ఖాన్ కి ఎంతో అభిమానం. ఇక అక్కినేని కాంపౌండ్ లో ఏఎన్నార్- నాగార్జునలకు బిగ్ బి ఫ్యామిలీతో- ఖాన్ లతో అనుబంధం ఉంది. దానిని అఖిల్- నాగచైతన్య మెయింటెయిన్ చేస్తున్నారు.

ప్రభాస్ రానా ఇద్దరూ `బాహుబలి` సినిమా తో దర్శకనిర్మాత కరణ్ జోహార్ కి ఎంతో సన్నిహితులయ్యారు. బాహుబలి రాకతో నూతన శకం మొదలైంది. బాలీవుడ్ – టాలీవుడ్ మైత్రి బంధం అన్ని విధాలా బలపడింది. అలాగే పలువురు బాలీవుడ్ స్టార్లతో ప్రభాస్- రానాలకు మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. రానా ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో కలిసి హౌస్ ఫుల్ 4 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అక్షయ్ తో- దర్మేంద్ర కాంపౌండ్- డియోల్ ఫ్యామిలీ తో అనుబంధం ఉంది. ఇక రితేష్ దేశ్ ముఖ్ వంటి స్టార్లతోనూ మన స్టార్లు అనుబంధం కలిగి ఉన్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉత్తరాదిన భారీ ఫాలోయింగ్ ఉంది. అతడు పలువురు బాలీవుడ్ టాప్ స్టార్లతోనూ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడని చెబుతుంటారు. ఇటీవల దేవరకొండ పేరు బాలీవుడ్ లో మార్మోగిపోతోంది. అక్కడ ఏకంగా అతిలోక సుందరి డాటర్ జాన్వీ కపూర్ దేవరకొండతో నటించాలనుంది అని స్టేట్ మెంట్ ఇవ్వడంతో ఇప్పుడు అతడు అక్కడా పాపులరైపోయాడు. షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి రీమేక్ లో నటిస్తున్నాడు కాబట్టి దేవరకొండకు టచ్ లో ఉన్నాడట. ఇలా మన స్టార్లంతా బాలీవుడ్ తో అనుబంధం పెంచుకోవడం మంచి పరిణామమే. మునుముందు బాలీవుడ్ – టాలీవుడ్ టై అప్ లతో భారీ ఫ్రాంఛైజీ సినిమాలు ప్రారంభం కావాలని కోరుకుందాం.
Please Read Disclaimer