పతకం కోల్పోయిన జమైకా చిరుత బోల్ట్!

0



usain-bolt-jamaica-rio-2016-olympicsడోపింగ్ టెస్టులో సహచర అథ్లెట్ నెస్టా కార్టర్ దొరకడంతో .. జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ పతకం కోల్పోయాడు. 2008 బీజింగ్ ఒలింపిక్ గేమ్స్ లో జమైకా తరపున 4×100 రిలే పోటీలో బోల్ట్ తో పాటు పాల్గొన్న మరో అథ్లెట్ కార్టర్ కూడా పాల్గొన్నాడు. అయితే, కార్టర్ కు సంబంధించిన మూత్ర, రక్త నమూనాలను మరోసారి పరీక్షించగా, అతడు నిషేధిత ఉత్ప్రేరకాలను వాడినట్లు తేలింది. దీంతో, ఆ జట్టు మొత్తానికి ఆ పతకాన్ని రద్దు చేస్తున్నట్లు ఒలింపిక్ అధికారులు ప్రకటించారు. ఈ ప్రకటనతో బోల్ట్ సహా నలుగురు అథ్లెట్లు ఆ పతకాన్ని పోగొట్టుకున్నట్టయింది. కాగా, 100 మీటర్ల పరుగులో అత్యంత వేగంగా పరిగెత్తే అథ్లెట్లలో ఆరో వాడు కార్టర్. బీజింగ్ లో జరిగిన 4×100 రిలే పోటీలో నలుగురిలో మొదటగా పరిగెత్తాడు. ఈ రేసును 37.10 సెకండ్లలో ఆ జట్టు పూర్తి చేసి నాడు ప్రపంచ రికార్డు సృష్టించింది