కన్నీళ్లు పెట్టుకున్న బోణీ కపూర్

0

సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అన్ని భాషల సినీ ప్రేక్షకుల అభిమానం దక్కించుకుని ఎన్నో మంచి చిత్రాలు అద్బుతమైన పాత్రలు పోషించిన శ్రీదేవి మరణంను ఆమె అభిమానులు ఇప్పటికి కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. ఆమె చేసిన సినిమాలు బుల్లి తెరపై వచ్చిన సమయంలో ఆమె జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ అభిమానులు విషాదంలో మునిగి పోతున్నారు. అలాంటిది ఆమె భర్త బోణీకపూర్ పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా బోణీ కపూర్ ఒక టాక్ షోలో పాల్గొన్న సమయంలో శ్రీదేవి గురించిన టాపిక్ వచ్చిన సమయంలో ఆయన కన్నీరు పెట్టుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.

63 ఏళ్ల బోణీ కపూర్ తాజాగా ‘ఔర్ ఏక్ కహానీ’ అనే టాక్ షోలో పాల్గొన్నాడు. ఆ సందర్బంగా హోస్ట్ ఒకానొక సందర్బంగా శ్రీదేవి గురించి ప్రశ్నించిన సమయంలో బోణీ కపూర్ స్పందిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రీదేవి మరణంను తాను ఇంకా జీర్ణించుకోలేక పోతున్నట్లుగా బోణీకపూర్ కన్నీరు పెట్టుకుంటూ చెప్పడం అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది.

ఫిబ్రవరి 24న శ్రీదేవి దుబాయిలోని ఒక హోటల్ లో ప్రమాద వశాత్తు మృతి చెందిన విషయం తెల్సిందే. ఆమె మృతి చెందిన సమయంలో చాలా వివాదం నెలకొంది. ఆమె అభిమానులు తల్లడిల్లి పోయారు. ఇక కుటుంబ సభ్యులు ఆమె మరణంతో శోఖసంద్రంలో మునిగారు. శ్రీదేవి ఇద్దరు కూతుర్లు కూడా ఇండస్ట్రీలో రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వగా త్వరలోనే ఖుషీ కూడా హీరోయిన్ గా వస్తానంటోంది.
Please Read Disclaimer