మా జీవితాలు ఎప్పటికీ అలా వుండవు ఉండబోవు: శ్రీదేవి భర్త

0”నా ప్రియతమా నీ ఆత్మకు శాంతి కలుగుగాక. మా జీవితాలు మాత్రం మునపటిలా ఎప్పటికీ ఉండబోవు”అన్నారు శ్రీదేవి భర్త బోనీ కపూర్‌. శ్రీదేవి అంత్యక్రియలు పూర్తయిన అనంతరం శ్రీదేవి ట్వీటర్‌ ఖాతా నుంచి ఆయన ట్వీట్‌ చేశారు. శ్రీదేవి మృతిచెందిన తర్వాత ఆమె ట్వీటర్ నుంచి పోస్టయిన తొలి ట్వీట్ ఇది.

‘‘స్నేహితురాలు, భార్య, ఇద్దరు కుమార్తెలకు తల్లి అయిన వ్యక్తిని కోల్పోవడం మాటల్లో చెప్పలేనంత నష్టం. ఈ సమయంలో మాకు అండగా నిలబడిన శ్రీదేవి అసంఖ్యాక అభిమానులకు, మా శ్రేయోభిలాషులకు, స్నేహితులకు హృదయపూర్వక ధన్యావాదాలు. ఈ ప్రపంచానికి ఆమె ఒక చాందిని, ఈ అద్భుత నటి వారికి శ్రీదేవి. నాకు మాత్రం ఆమె నా ప్రేమమూర్తి. నా స్నేహితురాలు. మా అమ్మాయిలకు తల్లి. నా జీవితభాగస్వామి. మాఇద్దరు అమ్మాయిలకు ఆమే సర్వస్వం. ఈ సమయంలో నా ఆందోళన అంతా ఒకటే. నా కుమార్తెలను రక్షించుకోవడం, శ్రీ లేకుండానే ముందుకు వెళ్లే మార్గం చూసుకోవడం. ఆమె మా జీవితం, మా బలం, మేము సదా నవ్వుతూ ఉండడానికి ఆమే కారణం. నా ప్రియతమా నీ ఆత్మకు శాంతి కలుగుగాక. మా జీవితాలు మాత్రం మునపటిలా ఎప్పటికీ ఉండబోవు…’’ అని బాధాతప్త హృదయంతో ఓ లేఖ రాశారు బోనీ.