సుభాష్ చంద్ర‌బోస్ వెబ్ సిరీస్ ట్రైల‌ర్ విడుద‌ల‌

0



దేశం గ‌ర్వించ‌ద‌గ్గ విప్ల‌వ యోధుడు సుభాష్ చంద్ర‌బోస్ జీవిత నేప‌థ్యంలో `బోస్: డెడ్ ఆర్ అలైవ్‌` టైటిల్ తో తాజాగా ఓ వెబ్ సిరీస్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. పుల్కిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సిరీస్ కి ఏక్తా క‌పూర్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నాకు రక్తాన్ని ఇస్తే మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తా అన్న బోస్ ఆ త‌ర్వాత నేతాజీగా ఎలా మారాడు, ఆయ‌న మ‌ర‌ణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటీ త‌దిత‌ర వివ‌రాలు ఈ వెబ్ సిరీస్ లో వివ‌రించనున్నారు. రాజ్ కుమార్ రావ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఈ వెబ్ సిరీస్ రూపొందుతుండ‌గా, ఇటీవ‌ల ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన టీం ఈ రోజు ట్రైల‌ర్ ని రిలీజ్ చేసింది. ఈ ట్రైల‌ర్ సిరీస్ పై భారీ అంచ‌నాలు పెంచింది. త్వ‌ర‌లో ఈ సిరీస్ `ఏఎల్‌టీ బాలాజీ` అనే వెబ్ ఛానల్‌లో ప్ర‌సారం కానుంది. మ‌రి `బోస్: డెడ్ ఆర్ అలైవ్‌` ట్రైల‌ర్ పై మీరు ఓ లుక్కేయండి.