బాబాయ్ ని గుర్తుచేసిన చరణ్

0

అందరూ ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్న ‘వినయ విధేయ రామ’ టీజర్ ఫైనల్ గా విడుదలయింది. ఫుల్ మాస్ అవతారంలో చెర్రీ చెలరేగిపోయాడు. టీజర్ చివరలో చరణ్ పేల్చిన పంచ్ మామూలుగా పేలలేదు.. ఇప్పుడు అందరి నోళ్ళలోనూ అదే నానుతోంది. “నువ్వు పందెం పరమేశ్ అయితే ఏంట్రా.. ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల”.. ఇక్కడ ‘కొ..ణి..దె..ల’ పలికే విధానం.. బాడీ లాంగ్వేజ్.. ఆ చేతుల్ని ఊపుతూ బల్లమీద కొట్టడం.. అబ్బో రచ్చ 2.0.

ఇక ఈ “పందెం పరమేశ్ అయితే ఏంట్రా.. ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల” డైలాగ్ చాలామంది అభిమానులకు చెర్రీ బాబాయ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బద్రి’ సినిమాలోని అల్ టైం క్లాసిక్ డైలాగ్ “నువ్వు నందా అయితే.. నేను బద్రి.. బద్రీనాథ్!” గుర్తు తెచ్చింది. ఇప్పటికే మూడు సినిమాలనుండి తన మాసును తనలోనే దాచుకున్న చెర్రీ జూలు విదిల్చిన సింహంలా చెలరేగిపోయాడని అభిమానులు సంబరపడుతున్నారు.

ఇదిలా ఉంటే ఇంత ఊర మాస్ ట్రైలర్.. దానికి ముందుగా మాస్ అవతారంలో ఉన్న ఫస్ట్ లుక్ ఇదంతా బోయపాటి ప్లాన్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టేనని ఇన్ సైడ్ టాక్ ని బట్టి తెలుస్తోంది. సినిమా మాస్ అయినా క్లాస్ స్టైల్ లో ప్రెజెంట్ చేద్దామని బోయపాటి ఆలోచనట. అందుకే వినయం విధేయత ఉన్న టైటిల్ తో పాటుగా చెర్రీ పంచెకట్టు గెటప్ ఫస్ట్ లుక్ ప్లాన్ చేశాడట. టీజర్లో కూడా ఒక ఎమోషనల్ సీన్ ఉంచుదామని అన్నాడట. కానీ చరణ్ మాత్రం సినిమా మాస్ కాబట్టి ఆ విషయం డైరెక్ట్ గా ఆడియన్స్ కు చెప్పేస్తే యాక్సెప్ట్ చేస్తారని. క్లాస్ అని ప్రోమోట్ చేసి మాస్ సినిమా అని తెలిస్తే నెగెటివ్ అవుతుందని ‘మాస్ లుక్’.. ‘ఊర మాస్’ టీజర్ ఉండాలని పట్టుబట్టాడట. ఫైనల్ గా తన మాటే నెగ్గించుకున్నాడట. ఇక బోయపాటి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ ఒగ్గాలో బాగా తెలిసిన వాడు కాబట్టి చెర్రీ చెప్పినదానికి సై సై అన్నాడట..!
Please Read Disclaimer