చిరంజీవి- బోయపాటి కాంబోలో చిత్రం రెడీ!

0chiranjeevi-and-Boyapatiమెగాస్టార్ చిరంజీవి- బోయపాటి శ్రీనుల కాంబోపై కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బోయపాటి తన సినిమా ఫినిష్ చేస్తుండడం.. ఇదే సమయానికి చిరు తన కొత్త ముూవీ ప్రారంభిస్తుండడంతో.. వీరి కాంబినేషన్ పై చర్చలు జరుగుతున్నాయి. చిరంజీవితో జత కట్టేందుకు మరో ఏడాది సమయం పట్టనుండడంతో.. అఖిల్ వైపు బోయపాటి మొగ్గుతున్నాడన్నది వాటి సారాంశం.

అయితే.. ఈ దర్శకుడి సన్నిహితులు చెబుతున్న మాటలు వేరేగా ఉన్నాయి. ఇప్పటికే చిరంజీవి కోసం ఓ కథ సిద్ధం చేసేశాడట బోయపాటి శ్రీను. సరైనోడు వేదికగా.. మెగాస్టార్ తన కోసం కథ సిద్ధం చేయమని అడిగిన వెంటనే రంగంలోకి దిగిపోయాడట ఈ డైరెక్టర్. ఒకవైపు బెల్లంకొండతో సినిమా చేస్తూనే.. చిరంజీవి కోసం స్క్రిప్ట్ ప్రిపేర్ చేశాడట. ఇప్పుడు జయ జానకి నాయక రిలీజ్ అయిన తర్వాత.. మెగాస్టార్ ని కలిసి నేరేషన్ ఇవ్వనున్నాడట. చిరంజీవిని ఇప్పటివరకూ అభిమానులు చూడనంత పవర్ ఫుల్ రోల్ లో చూపించేందుకు బోయపాటి రెడీ అంటున్నారు. #మెగా152 బోయపాటికే ఖాయం అయ్యే అవకాశాలు బోలెడన్ని ఉన్నాయని టాక్.

మరోవైపు మహేష్ తో జత కట్టేందుకు కూడా బోయపాటి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని అంటున్నారు. రీసెంట్ గా వీరిద్దరూ కలిసి చాలాసేపు మాట్లాడుకోవడంతోపాటు.. కలిసి పనిచేయడంపై ఓ అంగీకారానికి వచ్చారట. మాస్ హీరోయిజం పవర్ ఫుల్ గా చూపించడంలో దిట్ట అయిన బోయపాటితో జత కట్టేందుకు.. స్టార్ హీరోలంతా ఉత్సాహం చూపిస్తూనే ఉన్నారు.