కత్తి రెడ్డిగా వస్తున్న బ్రహ్మానందం

0


Brahmanandam-Kathireddy-Movieకొన్నేళ్ల క్రితం వరకూ బ్రహ్మానందం కనిపించగానే థియేటర్లలో నవ్వులు నిండిపోయేవి. హాస్య బ్రహ్మ అయిన బ్రహ్మీ.. స్టార్ల సినిమాలను తన భుజాలపై మోసే బాధ్యతను కూడా దిగ్విజయంగా హ్యాండిల్ చేయగలిగాడు. అయితే.. కాలం మెల్లగా మారిపోయింది.. బ్రహ్మీ కామెడీలో పస తగ్గిపోయింది.

అప్పట్లో బ్రహ్మానందం లేని సినిమా ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. కానీ ఇప్పుడు అరుదుగా మాత్రమే బ్రహ్మీ కనిపిస్తున్న సమయంలో.. కత్తి రెడ్డి అంటూ ఓ ప్రాజెక్ట్ పై అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ సినిమాలో బ్రహ్మానందం టైటిల్ రోల్ చేయనుండగా.. పవర్ ఫుల్ యాక్షన్ తో నవ్వులు పూయించేస్తాడట. కత్తి రెడ్డికి ‘ఎత్తితే దించడు’ అనే ఓ ఫన్నీ ట్యాగ్ లైన్ కూడా ఉంది. ప్రస్తుతం కెరీర్ లోనే ఎన్నడూ ఫేస్ చేయని కీలకమైన దశలో ఉన్న బ్రహ్మానందం.. కత్తి రెడ్డిగా ఎలా అలరిస్తాడనే సంగతి ఆసక్తి కలిగిస్తోంది. టైటిల్ చెప్పగానే ఇది సమర సింహారెడ్డి.. ఇంద్ర సేనా రెడ్డి.. ఆది లాంటి సినిమాలకు స్పూఫ్ లతో నింపేయచ్చే డౌట్ వస్తే మాత్రం.. అది తెలుగు సినిమా మేకర్స్ కామెడీపై జనాలకు ఏర్పడ్డ అభిప్రాయం అంతే.

నిజానికి బ్రహ్మీ ఫామ్ లో ఉన్నపుడే జఫ్ఫా అంటూ వెన్నెల కిషోర్ దర్శకత్వంలో ఓ సినిమా వచ్చింది. కానీ ఇది పెద్దగా వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత బ్రహ్మీ లీడ్ లో సినిమా ఏదీ చేయలేదు. ఇప్పుడు కత్తి రెడ్డి అంటూ కామెడీ చేయనున్నాడు సహస్ర చిత్రాల హాస్యనటుడు బ్రహ్మానందం.