దువ్వాడ జగన్నాథంకు బ్రాహ్మణులు హెచ్చరిక!

0Allu-Arjun-beats-Chiranjeevఅల్లు అర్జున్, హరీష్ శంకర్ ల కలయికలో రూపొందుతున్న ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రం టీజర్, పాటలతో ఇప్పటికే బోలెడంత క్రేజ్ ను సొంతం చేసుకోగా తాజాగా ఈ చిత్రం మరో వివాదంతో వార్తల్లో నిలిచింది. ఇంతకూ ముందే రుద్రాక్షమాల, జీన్స్ ప్యాంట్ తో ఉన్న అల్లు అర్జున్ లుక్ ను వ్యతిరేకించిన బ్రాహ్మణ కులస్థుల ఇప్పుడు మొన్ననే విడుదలైన ‘అస్మైక భోగ, తస్మైక భోగ’ అనే పాటపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు.

రచయిత సాహితి రాసిన ఈ పాటలోని లిరిక్స్ లోని పదాలు ‘నమకం.. చమకం’ రుద్ర స్తోత్రాన్ని అవమానించేవిగా ఉన్నాయని, వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులను, ఇతర పోలీస్ ఉన్నతాధికారులను కలిసి పిర్యాదు చేస్తామని హెచ్చరించారు. మరి ఈ వివాదంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి. గతంలో కూడా మంచు విష్ణు నటించిన ‘దేనికైనా రెడీ’ చిత్రంపై కూడా ఇలాంటి వివాదమే జరిగి రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.