ఓలమ్మో ఓలమ్మో.. ఏందిది?

0

బ్రెజిల్ దేశం నుంచి బాలీవుడ్ కు ఇంపోర్ట్ అయిన బ్యూటీ బ్రూనా అబ్దుల్లా. పేరు వింటే ఆయిల్ బావుల ఒనర్లయిన అరబ్ షేక్ పేర్ల లాగా ఉంటుంది కానీ వారికి ఈ సెక్సీ బ్యూటీకి సెంటీమీటర్ కూడా సంబంధం లేదు. అసలు ఈ బ్యూటీ ఫ్రీక్వెన్సీ పూర్తిగా వేరే. సెల్ ఫోన్ టవర్ చుట్టూ సిగ్నల్స్ ఎలా ఉంటాయో ఈ భామ ఎక్కడ బికినీ వేసుకంటే చుట్టుపక్కల గ్లామర్ వైబ్రేషన్స్ ఉంటాయి. అయితే ఆ వైబ్రేషన్స్ అక్కడే పరిమితం కావు.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది కాబట్టి సోషల్ మీడియా షేక్ అవుతుంది.

‘ఐ హేట్ లవ్ స్టోరీస్’.. ‘గ్రాండ్ మస్తి’.. ‘జైహో’ లాంటి బాలీవుడ్ సిన్మాల్లో నటించిన ఈ భామకు ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ కు ఫాలోయర్ల సంఖ్య ఈమధ్యనే హాఫ్ మిలియన్ దాటింది. ఇక చూసుకోండి.. ఒక మహా బోల్డ్ ఫోటో పోస్ట్ చేసి రచ్చ చేసిపారేసింది. ఇదిలా ఉంటే తాజాగా మరో ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో స్లిమ్ బికిని వేసుకుంది. స్లిమ్ బాడీ పై బికినీ కాదు బాబోయ్.. స్లిమ్ బాడీ పై స్లిమ్ బికిని. అ టైలర్ ఎవరోకానీ సినిమా ఎడిటర్ లాగా కత్తెరకు పని చెప్పి మరీ చిన్నదిగా చేసిపారేశాడు. మామూలుగానే బ్రూనా అందాల వడ్డన తట్టుకోలేం.. ఈసారి మరీ ఎక్కువైంది. ఈ బికినీ.. ఆ పోజు పుణ్యమా అని రెండు పచ్చబొట్లు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఒకటి ఎడమ మోచేయి కింద ఉంది. మరొకటి నాభి భాగం కింద లెఫ్ట్ సైడ్ లో ఉంది. ఫోటో సూపరే కానీ కొత్తది కాదు.. త్రోబ్యాక్ అంట. అంటే పాతది. ఫ్రెష్ గా పోస్ట్ చేసింది.

అయితే నెటిజనులకు కొత్త పాతలతో పనేముంది.. కంటెంట్ ముఖ్యం. మన సినిమా ఫంక్షన్లలో వక్తలు పొగడడంలో పోటీపడి..మహా అతి చేసి ప్రేక్షకులను చంపేస్తారు చూడండి… దాదాపు అలాగే పొగిడారు. అయితే ఇక్కడ ఉండేది బ్రూనా కాబట్టి నెటిజనులు అంత అతి చేసినా అందంగానే ఉంటుంది. ఎందుకంటే అసలు పొగడ్తలు ఉండేదే అందమైన భామల కోసం.. అవి వారికే సొంతం!
Please Read Disclaimer