వరదలో కొట్టుకుపోయిన ఓ కుటుంబం.. వీడియో

0బీహార్ రాష్ర్టాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదలు పోటెత్తాయి. రోడ్లన్నీ కొట్టుకుపోతున్నాయి. బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. బీహార్‌లోని అరారియా ప్రాంతంలో రెండు గ్రామాల మధ్య బ్రిడ్జి ఉంది. పనుల నిమిత్తం వేరే గ్రామానికి వచ్చిన ప్రజలు తిరిగి వారి స్వంత గ్రామానికి ఆ బ్రిడ్జి మీద నుంచి వెళ్తున్నారు. కానీ అప్పటికే ఆ బ్రిడ్జి 90 శాతం వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఇప్పుడు కానీ వారి స్వంత గ్రామానికి వెళ్లకపోతే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే బ్రిడ్జి కూలిపోతుంది. అవతలికి వెళ్లడానికి సమయం పడుతుంది కనుక.

మొత్తానికి గ్రామస్థులు ధైర్యం చేసి బ్రిడ్జి దాటారు. బ్రిడ్జి కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు దాన్ని దాటేందుకు ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి పరుగెత్తింది. రోడ్డుకు ఒకే ఒక్క అడుగు దూరంలో ఉండగానే బ్రిడ్జి కూలిపోయింది. దీంతో మహిళ ఇద్దరు పిల్లలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వరదలో కొట్టుకుపోయిన వారి కోసం రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది.