రోత ప్రశ్నలకు భలే అన్సరిచ్చిన బ్రూనా

0ప్రపంచంలో అందరూ మనకు నచ్చే వాళ్ళే ఉండరు. మనకు నచ్చేవే మాట్లాడరు. కావాలని మనల్ని కెలికి మన సెంటిమెంట్లను తిట్టి అదోరకమైన ఆనందం పొందుతారు. మనం కనుక సమాధానం చెప్తే మనం ఇరుక్కున్నట్టే. ఎందుకంటే.. మనదేశంలో హక్కులు పక్కనోడ్ని చక్కగా కెలికేవాడికే ఎక్కువగా ఉంటాయి. కానీ వాళ్ళకు కర్రా విరక్కుండా పాము చావకుండా అన్నట్టుగా సమాధానం చెప్పడం మామూలు విషయం కాదు. కానీ ‘ఇంపాజిబుల్ ఈజ్ నథింగ్’ అనే సూత్రాన్ని హాట్ బ్యూటీ బ్రునా అబ్దుల్లా నమ్మిందేమో.. ఆమె ఈ కష్టమైన పనిని చాలా ఈజీ గా చేసి చూపిస్తోంది.

ఈమధ్య ఈ బాలీవుడ్ నటీమణి సోషల్ మీడియా లో అభిమానులతో నెటిజనులతో చాట్ చేసింది. అందులో ఒక ప్రబుద్ధుడు “మీరు ఎప్పుడైనా ‘త్రీసమ్’ చేశారా?” అని అడిగాడు. ఆ పదం అర్థం మీకు తెలిసే ఉండాలి. తెలీకపొతే గూగుల్ లో కొట్టి మీనింగ్ చూడండి అంతే కానీ పొరపాటున కూడా ‘ఆసమ్’ లాంటి అందమైన పదమని గుడ్డిగా నమ్మొద్దు. సరే ఇలాంటి రోత ప్రశ్నకు మామూలుగా అయితే ఆమెకు తెలిసిన భాషలలో ఉన్న బూతులన్నీ వాడాలి కానీ ఆమె అలా చేయకుండా ‘అవును.. మీరు కనుక ముగ్గురు కలిసి చేసే పని అనే అర్థంలో అడిగుంటే చేశాను.. నా ప్రియమైన స్నేహితులతో కలిసి లంచ్ చేశాను అని చెప్పింది.

మరొకడు ‘మీరు వర్జినా?’ అని అడిగితే.. ‘నేను స్కార్పియన్’ అని చెప్పింది. ఇంకొకడు మరో బూతు ప్రశ్న అడిగాడు.. ‘మీ కప్ సైజ్ ఎంత?’ అని. దానికి స్టార్ బక్స్ కాఫీ షాప్ పేరు చెప్పి టాల్ కప్స్ అని చెప్పింది. ఇన్స్టాగ్రాం లో హాటు ఫోటోలు పెడుతుంటే బ్రూనాకి బాడీ ఉంది కానీ బుర్ర లేదనుకున్నారు బుర్రలేని యదవలు. తన పర్ఫెక్ట్ అన్సర్లతో అందరికీ షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో జనాలను వేగలేక చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ఖాతాలను వదిలేస్తున్నారు. “వెధవలను హేండిల్ చేయడం ఎలా 30 రోజుల్లో నేర్చుకోండి” అనే కోర్సు పెడితే బ్రునా సెలెబ్రిటీలకే ఓ సెలబ్రిటీ కావడం ఖాయం!