బీఎస్‌ఎన్‌ఎల్ రిపబ్లిక్ డే ఆఫర్

0BSNL-Logoగణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ మూడు ప్రత్యేక ప్రీ పెయిడ్ పథకాలు ప్రవేశపెట్టింది. అందులో ఎస్‌టీవీ 26 కూపన్ రీచార్జ్ ద్వారా 26 గంటలపాటు ఉచితంగా ఏదేని నెట్‌వర్క్‌కు అపరిమిత లోకల్, ఎస్‌టీడీ కాల్స్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఈ కూపన్ ఈనెల 25 నుంచి 31 వరకు అందుబాటులో ఉంటుంది. మరో రెండు ఆఫర్లలో ఒకటి కాంబో 2601 కాగా, మరొకటి కాంబో 6801. కాంబో 2601 ఆఫర్‌లో భాగంగా రీచార్జి విలువకు 1.5 రెట్ల టాక్‌టైం లభిస్తుంది. ఇందులో రూ.2600 విలువైన టాక్‌టైం మెయిన్ అకౌంట్లోకి, మరో రూ.1300 విలువైన టాక్‌టైం సెకండరీ అకౌంట్లోకి జమవుతుంది. సెకండరీ టాక్‌టైం కాలపరిమితి మూడు నెలల్లో ముగుస్తుంది. ఇక కాంబో 6801 ద్వారా 2 రెట్ల టాక్‌టైం లభిస్తుందని బీఎస్‌ఎన్‌ఎల్ వెల్లడించింది.