రూ. 249కే బీఎస్ఎన్‌ఎల్ 300జీబీ డాటా!

0BSNL-Logoరిలయన్స్ జియో ఉచిత అపరిమిత ఆఫర్ ఈ రోజుతో ముగుస్తుండటంతో ఇతర టెలీకాం సంస్థలు వేగాన్ని మరింత పెంచాయి. రకారకాల ఆఫర్లతో కస్టమర్లను ఉక్కిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ప్రభుత్వరంగ టెలీకాం సంస్థ బీఎస్‌ఎన్ఎల్ తన బ్రాండ్‌బ్యాండ్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ‘అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ యట్ 249’ పేరుతో నెలరోజుల పాటు రోజుకి 10జీబీ డాటాను అందిస్తున్నట్లు ప్రకటించింది. అంటే నెలకి రూ. 249 చెల్లిస్తే రోజుకి డౌన్‌లోడ్, బ్రౌజింగ్ కోసం 10జీబీ డాటాను వాడుకోవచ్చు.

అంతేకాకుండా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య ఏ నెట్‌వర్క్‌కి అయినా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ఆదివారం రోజు మొత్తం అపరిమిత కాల్స్ చేయొచ్చు. తన బ్రాండ్‌బ్యాండ్ సర్వీసులకి కొత్త కస్టమర్లను ఆకర్షించడానికే కంపెనీ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ‘దేశంలో ఇంత తక్కువ ధరతో రోజుకి 10జీబీ డాటా అందిస్తుందన్న వైర్‌లైన్ బ్రాండ్‌బ్యాండ్ కంపెనీ బీఎస్‌ఎన్ఎల్ మాత్రమే’ అని బీఎస్‌ఎన్ఎల్ బోర్డ్ డైరెక్టర్ ఎన్.కె. గుప్తా వెల్లడించారు. అయితే కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ పొందడానికి మీకు దగ్గర్లోని బీఎస్‌ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800 345 1500ని సంప్రదించాలి.