రోజుకు 10 జీబీ డేటాను ప్రకటించిన బిఎస్ఎన్ఎల్

0bsnl-440ప్రముఖ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌) వినియోగదారులకు సరికొత్త ఆఫర్ ప్రకటించి ఆకట్టుకుంది.. ‘ఎక్స్‌పీరియన్స్‌ అన్‌లిమిటెడ్‌ బీబీ 249’ పేరుతో సరికొత్త బ్రాడ్‌బాండ్‌ (వైర్‌లైన్‌) పథకాన్ని ప్రవేశ పెట్టింది. కేవలం రూ.249 చెల్లించడం ద్వారా రోజుకు 10 జీబీ డేటాను పొందవచ్చునని బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలిపింది.

దేశంలో ఇంత తక్కువ ఛార్జీతో అత్యధిక డేటాను ఇస్తున్న టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ కావడం గమనార్హం. అలాగే ఈ పథకంలో ఏ నెట్‌వర్క్‌కైనా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల్లోపు అపరిమిత కాల్స్‌ కూడా చేసుకోవచ్చు. ఆదివారం నాడు రోజంతా ఉచితంగా మాట్లాడుకోవచ్చు. డేటా వేగం విషయానికొస్తే 2 ఎంబీపీఎస్‌ ఉంటుంది.