బన్నీకి మెగాస్టార్ టెన్షన్

0

మెగాఫ్యామిలీని కనుసైగతో శాసిస్తారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన అనుమతి లేనిదే ఏ పని జరగదు. అలాంటి మెగాస్టార్ సినిమా వల్ల ఇప్పుడు అల్లు అర్జున్ తెగ టెన్షన్ పడుతున్నాడు. ఆయన సినిమాను బేస్ చేసుకునే తన సినిమా రిలీజ్ ను ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెగ బాధపడిపోతున్నాడు.

మ్యాటర్ లోకి వెళ్తే.. బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రెడీ కాబోతుంది. ఇప్పటినుంచి మొదలుపెడితే.. ఈ మూవీని దసరా టైమ్ కు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దసరా అనేది కలెక్షన్స్ కు మంచి సీజన్ కాబట్టి.. బన్నీ-త్రివిక్రమ్ ఇద్దరూ హ్యాపీగానే ఉన్నారు. కానీ ఇక్కడే వారికి టెన్షన్ మొదలైంది. మెగాస్టార్ ప్రెస్డీజియస్ ప్రాజెక్ట్ సైరా దసరాకు రిలీజ్ అయితే. అప్పుడు వీళ్లు సంక్రాంతికి షిఫ్ట్ అవ్వాలి. పోనీ సైరా కోసం త్యాగం చేసి సంక్రాంతికి వెళ్లిపోదామని అనుకుంటే.. సైరా సినిమా దసరాకు వచ్చే సూచనలు కన్పించడం లేదు.

అన్నింటికి మించి సైరా లాంటి పెద్ద బడ్జెట్ మూవీ వసూళ్లు బాగా ఉండాలంటే సంక్రాంతి సీజనే సరైనది. దీంతో తన సినిమాను ఎప్పటికి ప్లాన్ చేసుకోవాలో తెలీక టెన్షన్ పడుతున్నాడు. అలాగనీ.. సైరా ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని మెగాస్టార్ ని అడగలేడు. పాపం బన్నీ పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లుగా తయారైంది.
Please Read Disclaimer