అసిస్టెంట్ పెళ్లిలో అతిధి బన్ని

0

అసిస్టెంట్ పెళ్లికి ఏకంగా స్టార్ హీరో అటెండయితే.. అతడి ఆనందానికి అవధులు ఉంటాయా? ఆ కుటుంబం ఎంతో హ్యాపీ మూడ్ లోకి వెళుతుంది. అంత పెద్ద స్టార్ తమపై అభిమానంగా తన విలువైన సమయాన్ని వెచ్చించి పెళ్లికి వచ్చి నవవధూవరుల్ని ఆశీర్వదించి వెళితే అంతకంటే ఆనందం ఇంకొకటి ఉంటుందా? అలాంటి హ్యాపీ అకేషన్ కుదిరింది ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కి. వివరాల్లోకి వెళితే..

గీతా ఆర్ట్స్ లో ఆఫీస్ బోయ్ గా చేరి అటుపై అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా మారిన శిరీష్ గురించే ఇదంతా. చాలా కాలం క్రితం అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ కార్యాలయంలో శిరీష్ తొలుత బోయ్ గా ఉద్యోగంలో చేరాడు. అయితే అతడికి ఉన్న డ్యాన్స్ ఫ్యాషన్ గురించి తెలుసుకున్న బన్ని వెంటనే తన డ్యాన్స్ ఇనిస్టిట్యూట్ లో క్లాసులకు పంపాడు. ప్రస్తుతం బోయ్ శిరీష్ కాస్తా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఎదిగాడు. మునుముందు కొరియోగ్రాఫర్ గానూ ప్రమోటయ్యేందుకు ఛాన్స్ ఉంది.

శిరీష్ నిన్నగాక మొన్న పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి అల్లు అర్జున్ విచ్చేయడమే గాక నవవధూవరుల్ని ఆశీర్వదించి ఆ కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తాడు. అంత పెద్ద స్టార్ ఎలాంటి భేషజం లేకుండా ఆ పెళ్లిలో అందరితో సరదాగా మాట్లాడుతూ కలిసిపోయాడు. సరదాగా మాట్టాడాడు. మెగా కాంపౌండ్ హీరోల్లో ఉన్న ప్రత్యేక లక్షణమే ఇది. తమ అభిమానుల్ని విడిచి అస్సలు ఉండరు. ఏ కష్టం వచ్చినా ఆదుకుంటారు. బన్ని అందులో ఇంకా ఫాస్ట్. గతంలో ఎందరో అభిమానులకు ఇలాంటి సర్ ప్రైజ్ లు ఇచ్చిన బన్ని ప్రస్తుతం శిరీష్ కి అలాంటి ట్రీట్ నే ఇచ్చాడు. కొరియోగ్రాఫర్ శిరీష్ పెళ్లి కోసం యూరప్ ట్రిప్ ముగించుకుని మరీ బన్ని హైదరాబాద్ కి రావడం ఇక్కడో ఆసక్తికర ట్విస్ట్.

చిన్న స్థాయి నుంచి కొరియోగ్రాఫర్ గా ఎదుగుతున్న శిరీష్ కథ స్ఫూర్తివంతమైనదే అనడంలో సందేహమేం లేదు. ఎందరో ట్యాలెంటెడ్ యూత్ కృష్ణానగర్.. యూసఫ్ గూడలో టైమ్ కలిసి రాక కలతకు గురవుతూనే ఉంటారు. అలాంటి వారందరికీ ఇది స్ఫూర్తివంతమే కదా!
Please Read Disclaimer