కోకాపేటలో బన్నీ వెడ్డింగ్ ప్లానింగ్ సెట్

0

Bunny -wedding-plan‘జులాయి’ చిత్రం తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా కోసం కోకాపేటలో ఓ స్పెషల్ సెట్ వేసారు. ఆ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో బన్నీ స్టైలిష్ వెడ్డింగ్ ప్లానర్ గా కనిపించబోతున్నాడు. ఇందులో బన్నీ సరసన ఆదాశర్మ, నిత్యామీనన్, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిత్యా మీనన్ నెగెటివ్ పాత్రలో నటిస్తున్నట్లుగా తెలిసింది. కె.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాలో నటి స్నేహ, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Please Read Disclaimer