బన్నీ ఫాన్స్ కి పంచ్ మిస్అయినట్లే !

0allu-arjun-and-trivikramపవన్‌ రాజకీయ ఎంట్రీలో త్రివిక్రం కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెల్సిందే. పవన్‌ స్పీచ్‌ నుండి మొదలుకుని ‘జనసేన’ పార్టీ విధివిధానాల రూపకల్పణలో త్రివిక్రం కీలక పాత్ర పోషిస్తున్నాడు. పవన్‌కు అత్యంత సన్నిహితుడు అయిన ఈ మాటల మాంత్రికుడు రాబోయే ఎన్నికల్లో ఏదో ఒక స్థానం నుండి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు చర్చ కూడా సాగుతోంది. అయితే త్రివిక్రం ‘అత్తారింటికి దారేది’ చిత్రం తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం లేనట్లే అని తెలుస్తోంది.

పవన్‌ పార్టీకి ప్రోత్సహించాడు అని త్రివిక్రంపై మెగా ఫ్యామిలీ గుర్రుగా ఉంది. అందుకే అల్లు అర్జున్‌కు త్రివిక్రంతో సినిమా క్యాన్సిల్‌ చేసుకోవాల్సిందిగా అల్లు అరవింద్‌ చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బన్నీ త్రివిక్రంకు ఫోన్‌ చేసి సినిమా క్యాన్సిల్‌ చేసుకుంటున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఇకపై పవన్‌ తప్ప మిగిలన ఏ మెగా హీరోలు త్రివిక్రంతో సినిమాలు చేసే అవకాశం లేదు అని తెలుస్తోంది. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత త్రివిక్రం సినిమాలు చేస్తాడా అనేది కూడా ఒక ప్రశ్న.