బుర్రకథ టీజర్ టాక్

0

డైలాగ్ కింగ్ వారసుడిగా ప్రేమ కావాలి తో పరిచయమైన ఆది సాయి కుమార్ హీరోగా రూపొందిన కొత్త సినిమా బుర్రకథ. హాస్య చిత్రాల రచయితగా పేరున్న డైమండ్ రత్నబాబు మొదటిసారి దర్శకుడిగా డెబ్యు చేస్తున్న మూవీ ఇది. ఇందాకా ట్రైలర్ విడుదల చేశారు. ఓ యువకుడికి రెండు బుర్రలు ఉండటమే ఇందులో ట్విస్ట్.

అభిరామ్(ఆది సాయి కుమార్)కు పుట్టుకతోనే రెండు బుర్రలు ఉంటాయి. ఒకటి అభిగా జాలీగా ఉంటె రెండోది రామ్ పేరుతో ఆధ్యాత్మికత ప్రశాంత చిత్తంతో దానికి పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. దీని వల్ల తండ్రి(రాజేంద్ర ప్రసాద్)ఇబ్బంది పడుతూ ఉంటాడు. తనతో ప్రేమలో ఉంటుంది హ్యాపీ(మిస్త్రి చక్రవర్తి).

అభిరాంను ట్రీట్ చేస్తున్న డాక్టర్(పోసాని)కి సైతం ఈ సమస్య అంతు చిక్కదు. అసలు ఈ రెండు బుర్రలతో అభిరాం ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు అతని జీవితంలోకి వచ్చిన విలన్(అభిమన్యు సింగ్)వల్ల ఎలాంటి ప్రమాదాలను ఎదురుకున్నాడు అనేదే కథగా కనిపిస్తోంది

ఆది సాయికుమార్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలు ఈజ్ తో చేసుకుంటూ పోయారు. ఒకే మనిషిలో రెండు బుర్రలు కాబట్టి గెటప్స్ పరంగా వేరియేషన్స్ లేకపోయినా యాక్టింగ్ పరంగా మంచి వ్యత్యాసం చూపించాడు. రాజేంద్రప్రసాద్ పోసానిలు తమ టైమింగ్ తో అలరించగా టీజర్ చివర్లో జంబలకిడిపంబలో బ్రహ్మానందం స్టైల్ లో పృథ్వి విధవ రూపంలో చేసిన కామెడీ వెరైటీ గా ఉంది.

మొత్తానికి రొటీన్ గా కాకుండా ఏదో డిఫరెంట్ గా ట్రై చేసిన ఆది సాయికుమార్ ఇందులో కాస్త విభిన్నంగా కనిపించాడు. రత్నబాబు దర్శకత్వ శైలిలో అతని కామెడీ టైమింగ్ కనిపించింది. రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం సాయి కార్తీక్ సంగీతం అందించిన బుర్రకథ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయాల్సి ఉంది
Please Read Disclaimer