పలమనేరు వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు సజీవదహనం

0చిత్తూరు: చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని నంగిళి వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. ఎదురెదురుగా వస్తున్న లారీ-ఓల్వో బస్సు ఢీకొనడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణీకులు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో గాయపడిన వారిని 108 సాయంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు.