చిన్న సినిమాపై అంత ఓవర్ కాన్ఫిడెన్సా?

0

చిన్న సినిమాల మార్కెట్ కొత్త ఆశలు రేపుతోంది. చిన్న బడ్జెట్ చిత్రాలకు మహర్ధశ పట్టే సమయం ఆసన్నమైంది. టీవలి మజిలీ.. జెర్సీ లాంటి చిత్రాలు పరిమిత బడ్జెట్ లో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడంతో పరిశ్రమలో పాజిటివిటీ నెలకొంది. ఒకప్పుడు చిన్న సినిమా అంటేనే కొనేవాళ్లు దరికి రానిచ్చేవారు కాదు. కానీ చిన్న సినిమా అయినా ఫలానా వాళ్లు తీస్తే హిట్టు ఖాయం అనుకుని కొనుక్కునే సంస్థలు ఉన్నాయి. పలువురు అగ్ర నిర్మాతల బ్యాకప్ తో చిన్న సినిమా రిలీజ్ కష్టాలు తొలగిపోయే వెసులుబాటుపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఈ ఒరవడిలోనే ప్రఖ్యాత డిస్ట్రిబ్యూటర్ కం ప్రొడ్యూసర్ అభిషేక్ నామా `సెవన్` అనే పరిమిత బడ్జెట్ సినిమాని నమ్మి రైట్స్ తీసుకోవడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. సినిమా రిలీజ్ రైట్స్ ని కొనుక్కోవడమే గాక.. ఈ సినిమాకి కావాల్సినంత ప్రమోషనల్ సాయాన్ని ఆయన అందించనున్నారు. హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో తెరకెక్కిన సెవెన్ డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్. రెజీనా నందితా శ్వేత అనీష్ ఆంబ్రోస్ త్రిధా చౌదరి అదితి ఆర్య పూజితా పొన్నాడ నాయికలు. చిత్రీకరణ పూర్తయింది. ఇటీవల రిలీజైన ట్రైలర్.. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రిలీజ్ కానుంది. ఫస్ట్ కాపీ చూసిన అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా క్రేజీ ఆఫర్ ఇచ్చి ఈ సినిమా ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నారు.

సెవెన్ తొలి కాపీ చూడగానే మైండ్ బ్లోవింగ్ అనిపించింది. హాలీవుడ్ సినిమాలా విజువల్ ఫీస్ట్ ని తలపించిందని అభిషేక్ అన్నారు. ఇందులో ట్విస్టు వెనక ట్విస్టు మైమరిపిస్తాయి. ఆరుగురు నాయికలు జిల్ చిల్. థ్రిల్లర్ జోనర్ లో ట్రెండ్ సృష్టిస్తుందీ సినిమా… రమేష్ వర్మ కథ..కతనం ఆసక్తికరం. హవీష్ యాక్టింగ్ మరో హైలైట్. నటుడిగా కొత్త హవీష్ ను ప్రేక్షకులు ఈ సినిమాలో చూస్తారు. రమేష్ వర్మ కథకు ఛాయాగ్రాహకుడు నిజార్ షఫీ న్యాయం చేశారు అని ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న అభిషేక్ తెలిపారు.
Please Read Disclaimer