ప్రభుత్వ లాంఛనాలతో సినారె అంత్యక్రియలు పూర్తి

0narayanareddy-dead-bodyప్రముఖ సాహితీవేత్త, విశ్వంభరుడు డాక్టర్ సి.నారాయణరెడ్డి అంత్యక్రియలను ఘనంగా నిర్వహించారు. ఫిలింనగర్ లోని మహప్రస్థానంలో బుదవారం మధ్యాహ్నం సినారెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.

సినారె అంత్యక్రియల్లో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. తన అభిమాన కవి గా సినారెను కెసిఆర్ చెప్పుకొంటారు. అందుకే ఆయన అంత్యక్రియల్లో కూడ కెసిఆర్ పాల్గొని తన అభిమానాన్ని చాటుకొన్నారు. అంత్యక్రియలు ముగిసేవరకు కెసిఆర్ మహప్రస్థానంలోనే ఉన్నారు.

సినారె పార్థీవదేహం వద్ద కెసిఆర్ నివాళులర్పించారు. సిఎం తో పాటు పలువురు మంత్రులు, సాహీతీవేత్తలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతిమయాత్రలో పాల్గొనేందుకు వివిద ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ఆయన అభిమానులు వచ్చారు.

గుండెపోటుతో ఆయన రెండు రోజుల క్రితం మరణించారు. అమెరికా నుండి ఆయన మనమడు వచ్చిన తర్వాత బుదవారం నాడు అంత్యక్రియలను నిర్వహించారు.