వైర‌ల్ వీడియో: అత‌ని కాల్లో ఏలియ‌న్‌!

0ఏలియ‌న్ మూవీస్ చూసే అల‌వాటుందా? అందులో వింత ప్రాణి మ‌నిషి శ‌రీరంలోకి దూరి లోప‌ల పాకుతూ వెళ్లే సీన్స్ చాలానే చూసి ఉంటారు. స‌రిగ్గా అలాంటిదే ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైర‌ల్ అయింది. కాలిఫోర్నియాకు చెందిన ఏంజెల్ బెర్ముడెజ్ అనే వ్య‌క్తి పోస్ట్ చేసిన 50 సెక‌న్ల ఈ వీడియో చూస్తే నిజంగానే అత‌ని కాల్లో ఏలియ‌న్ దూరిందా అన్న అనుమానం మీకు క‌లుగుతుంది. జిమ్‌లో వ‌ర్క‌వుట్ చేసిన త‌ర్వాత కాలి కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో బెర్ముడెజ్ బాధ‌తో విల‌విల్లాడాడు. ఆ వీడియో చూస్తే అత‌ని కాల్లో ఏదో పాకుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఆ బాధ‌ను త‌ట్టుకోలేక అత‌ను అర‌వడం కూడా వినిపిస్తుంది. ఫేస్‌బుక్‌లో ఈ వీడియోను ఇప్ప‌టికే కోటిన్న‌ర మంది చూడ‌గా.. ల‌క్షా 70 వేల మంది షేర్ చేశారు. డీహైడ్రేష‌న్ లేదా ర‌క్తంలో త‌గినన్ని మిన‌ర‌ల్స్ లేక‌పోవ‌డం వ‌ల్ల ఇలా కండ‌రాలు ప‌ట్టేస్తుంటాయి.