ఆ మోడల్ పొడుగు కాళ్లకు గిన్నిస్ రికార్డు

0caroline-arthur-record-for-the-world-longest-legsపొడుగు కాళ్ల సుందరి అన్న వెంటనే మనకు శిల్పా శెట్టి గుర్తుకు వస్తుంది. అయితే.. ఇప్పుడు చెప్పే మాజీ మోడల్ ముచ్చట విన్నాక.. పొడుగు కాళ్లు అన్న తర్వాత ఆమె మాత్రమే గుర్తుకు వస్తుందటంలో సందేహం లేదు. ఆస్ట్రేలియాకు చెందిన కెరోలినా అర్థర్ మోడల్ గా సుపరిచితురాలు. పెళ్లై.. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఈ ఫ్రౌఢ ఉన్నట్లుండి ఇప్పుడు ప్రపంచ మీడియాను అమితంగా ఆకర్షిస్తున్నారు.

ఇప్పుడామె హాట్ టాపిక్ గా మారారు. 39 ఏళ్ల ఈ మాజీ మోడల్ ఇప్పుడు గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇంతకీ ఆమె సాధించిన రికార్డు ఏమిటో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ప్రపంచంలోనే అతి పొడువైన కాళ్లున్న మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. పిరుదులు నుంచి పాదాల వరకూ ఆమె ఎత్తు తెలిస్తే నోట మాట రాదంతే.

ఆమె పిరుదుల మీద టేపు పెట్టి పాదాల వరకు జారిస్తే.. ఏకంగా ఆమె కాళ్ల పొడువు 51.5 అంగుళాలుగా తేలింది. ఇక.. హైట్ పరంగా చూస్తే.. ఆమె ఎత్తు 6.2 అడుగులుగా చెబుతున్నారు. ఆమె శరీరంలో కాళ్లు 69 శాతంగా చెబుతారు. తనకొచ్చిన రికార్డు గురించి రియాక్ట్ అవుతూ.. తన కంటే పొడవైన కాళ్లు ఉన్న మహిళలు ఆస్ట్రేలియాలో కానీ.. అమెరికాలో కానీ తప్పనిసరిగా ఉంటారంటారు.

ఆ సంగతి ఏమో కానీ.. అర్థర్ వయ్యారంగా కూర్చొని.. తన పొడువు కాళ్లను అలా జాపి వయ్యారంగా బాడీని కాస్త బెండ్ చేసి ఫోజు ఇస్తే.. ఎలాంటోడి గుండె అయినా కాసింత సేపు లయ తప్పాల్సిందే. ఈ మాటలో నిజం ఎంతన్నది అమ్మడి ఫోజ్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

loading...