సినీ దర్శకుడు బాబీపై ఫిర్యాదు

0వేగంగా వచ్చి తన కారును ఢీ కొట్టిన సినీ దర్శకుడు బాబీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ వ్యాపారి జూబ్లీహిల్స్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. అమీర్‌పేట్‌కు చెందిన హర్మేందర్‌సింగ్‌ ఆదివారం రాత్రి 11.30కు తన కారులో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.33 మీదుగా వెళ్తున్నాడు. అదే సమయంలో అటుగా వస్తున్న సినీ దర్శకుడు (జైలవకుశ, సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ ఫేమ్‌) బాబీ వేగంగా వచ్చి ఈ కారును ఢీకొట్టారు. దీంతో దెబ్బతింది. కారునుంచి బయటకు వచ్చిన హర్మేందర్‌సింగ్‌.. మాట్లాడుతుండగా బాబీ జారుకున్నాడు. మద్యంమత్తులోనే తన కారును ఢీకొట్టాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.