సెక్స్‌ రాకెట్‌ గుట్టురట్టు: సినీ డైరెక్టర్ అరెస్ట్

0sex-racketస్నేహితుడి ఇంటిని అద్దెకు తీసుకున్న ఓ డైరెక్టర్‌ అడిషన్స్‌ పేరుతో అమ్మాయిల అడ్డాగా మార్చేశాడు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కత్రిగుప్పె కట్టింగ్‌షాప్‌ సినిమా డైరెక్టర్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. సినీ డైరెక్టర్‌ ప్రఖ్యాత్‌ తన స్నేహితుడైన పురుషోత్తానికి చెందిన ఇంటిని కొంతకాలం కిందట అద్దెకు తీసుకున్నాడు.

ఆడిషన్స్‌ పేరుతో అమ్మాయిలను ఇంటికి తీసుకువస్తూ తన ఇష్టరీతిన వ్యవహరించి చుట్టుపక్కల వారికి ఇబ్బందులు కలిగిస్తున్నాడు. అమ్మాయిను తీసుకొచ్చి అక్కడ గుట్టుగా వ్యాపారం చేస్తున్నాడని భావించిన అతడి స‍్నేహితుడు పురుషోత్తం… ఇంటిని ఖాళీచేయాలని పద్ధతి మార్చుకోవాలని ప్రఖ్యాత్‌కు సూచించాడు. దీంతో డైరెక్టర్‌ కొంతమంది రౌడీలతో పురుషోత్తంను బెదిరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రఖ్యాత్‌ను అరెస్ట్‌ చేశారు.