హీరోయిన్లు ఇష్ట ప్రకారమే పడుకొంటారు: ఎంపీ

0


Heroineసినీ హీరోయిన్లను ఉద్దేశించి కేరళ ఎంపీ, అమ్మ చీఫ్, నటుడు వరీద్ ఇన్నోసెంట్ థెక్కెతల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ (పాత్రల కోసం పడుకోవడం) లేదు అని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ఎంపీ ఇన్నోసెంట్ మీడియాతో మాట్లాడుతూ హీరోయిన్ల చెడు ప్రవర్తన గురించి ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండే వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అని పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేరళ ఎంపీ అయిన ఇన్నోసెంట్ మలయాళ మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్‌ (అమ్మ)కు అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు.

గతవారం అమ్మ నిర్వహించిన మీడియా సమావేశం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టులపై ఎంపీ ఇన్నోసెంట్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నిరసన వ్యక్తమవుతున్నది. మీడియా సమావేశానికి హాజరైన విలేకర్లు ప్రశ్నలు అడగకుండా చాయ్, బిస్కెట్లు, స్నాక్స్ అడిగారని జర్నలిస్టులపై ఎంపీ ఇన్నోసెంట్ వ్యాఖ్యలు చేశారు.

మలయాళ తారల కిడ్నాప్, లైంగిక దాడుల అంశాలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నలతో చుక్కలు చూపించారు. మలయాళ నటి కిడ్నాప్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఎంపీ ఇన్నోసెంట్ రాజీనామా చేస్తున్నారనే వార్తలు మీడియాలో గుప్పు మన్నాయి. అయితే తాను రాజీనామా చేయడం లేదని ఎంపీ ఇన్నోసెంట్ వివరణ ఇచ్చారు.

రాజీనామా అంశంపై బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్ గురించి జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలను ఖండించారు. మలయాళ చిత్ర పరిశ్రమలో అలాంటి వ్యవహారం లేదు అని ఎంపీ స్పష్టం చేశారు. సినీ తారలపై జరుగుతున్న జర్నలిస్టును సిస్టర్ అని సంభోదించారు. సినీ తారలపై లైంగిక వేధింపులు ప్రస్తుతం లేవు. అవన్నీ ఎప్పుడో పోయాయి. నీలాంటి ధైర్యవంతులైన మహిళలు ఉన్నారు. అన్యాయాలను బహిరంగంగానే బయటపెడుతున్నారు అని ఆయన అన్నారు.

చిత్ర పరిశ్రమలో చెడు ప్రవర్తన ఉన్న కొందరు తారలతోనే సమస్యలు వస్తున్నాయి. అవకాశాల కోసం కొందరు హీరోయిన్లు దిగజారుతున్నారు. అలాంటి వారే సినీ నిర్మాతలు, దర్శకుల పక్కలోకి వెళ్తున్నారు అని ఎంపీ ఇన్నోసెంట్ పేర్కొన్నారు. గతవారం జరిగిన అమ్మ సమావేశంలో మోహన్‌లాల్, మమ్ముట్టి, దిలీప్ లాంటి సూపర్‌స్టార్లు, కొందరు మంత్రులు కూడా పాల్గొన్నారు.