సిగరెట్‌ తాగడంపై హీరోయిన్ వివరణ!

0Catherine-Tresaతన గ్లామర్ తో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి క్యాథరీన్ థ్రెసా. స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోతున్నా.. తను చేస్తున్న సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది ఈమె. దగ్గుబాటి రానా హీరోగా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో ఒక ప్రధాన పాత్ర చేస్తోంది ఈ నటీమణి. ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ లో క్యాథరీన్ సిగరెట్ తాగుతూ అగుపిస్తోంది. దీని గురించినే వివరణ ఇచ్చిందామె.

తను కేవలం పాత్ర పోషణలో భాగంగానే సిగరెట్ తాగను తప్ప.. వ్యక్తిగతంగా పొగతాగడానికి వ్యతిరేకిని అని క్యాథరీన్ చెప్పుకొచ్చింది. ఒక మహిళగా తను సిగరెట్ తాగడాన్ని ఏ మాత్రం సమర్థించను అని స్పష్టం చేసింది. అయితే సినిమాలో తన పాత్ర కోసమే సిగరెట్ తాగాల్సి వచ్చిందని అంది. తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాలో తను నెగిటివ్ కేరెక్టర్ పోషిస్తున్నాను అని క్యాథరీన్ చెప్పింది.

తను చాలా లక్కీ అని.. ఒకవైపు గ్లామర్ ను ఒలకపోస్తూనే, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు దక్కుతున్నాయని.. టాలీవుడ్ తనకు అలాంటి అవకాశాలు ఇస్తోందని క్యాథరీన్ తెలిపింది. ‘గౌతమ్ నందా’లో కూడా క్యాథరీన్ ఒక హీరోయిన్ గా చేస్తోంది. ఆ సినిమా కోసం తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాను అని తెలిపింది. ప్రత్యేకంగా టీచర్ ను ఏర్పాటు చేసుకుని తెలుగు నేర్చుకున్నానని వివరించింది.