ఐటెం సాంగ్ లో చిందేస్తున్న ఎమ్మెల్యే

0Catherine-Item-Songగతేడాది అల్లు అర్జున్ తో సరైనోడు మూవీ తీసి.. బన్నీ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ తో పాటు.. ఇండస్ట్రీ హిట్ కూడా సాధించిన దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ డైరెక్టర్ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో రొమాంటిక్ జోనర్ లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో గ్లామర్ డోస్ ను పీక్ స్టేజ్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బోయపాటి.

టాప్ గేర్ లో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ను మెయిన్ హీరోయిన్ గాను.. ప్రగ్యా జైస్వాల్ ను సెకండ్ హీరోయిన్ గాను తీసుకున్న బోయపాటి.. ఈ చిత్రానికి మరింతగా గ్లామర్ అద్దుతున్నాడు. సరైనోడు మూవీలో ఎమ్మెల్యే కేరక్టర్ చేసిన కేథరిన్ థ్రెసాను.. బెల్లంకొండ శ్రీను పక్కన ఓ స్పెషల్ సాంగ్ లో చేసేందుకు ఒప్పించాడట. బోయపాటితో ఉన్న అనుబంధం కారణంగా.. ఈ ఆఫర్ ను కేథరిన్ ఒప్పుకుందని తెలుస్తోంది. ఓ భారీ సెట్ ను నిర్మించి.. అందులో కేథరిన్- బెల్లంకొండ శ్రీనివాస్ లతో ఈ ఐటెం సాంగ్ పిక్చరైజేషన్ చేయనున్నారని తెలుస్తోంది.

ఈ భామ ఖైదీ నంబర్ 150లోనే చిరంజీవి పక్కన ఐటెం సాంగ్ చేయాల్సి ఉంది కానీ.. అప్పట్లో కొన్ని కారణాలతో తప్పుకుంది. అప్పుడు కేథరిన్ అందాలను మిస్ అయిన ఫ్యాన్స్ కు.. ఇప్పుడు బోయపాటి ట్రీట్ అందించబోతున్నాడు.