తేజ ఈమెను ఎందుకు కొట్టలేదంటే..

0Catherine-Tresa-Bikiniఒకప్పుడు స్టార్స్ లేకున్నా పూర్తి కొత్త తారాగణంతో సినిమాను తెరకెక్కించి బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న దర్శకుడు తేజా. అయితే ఆయన సినిమాలు అంతగా హిట్ కావడానికి కారణం సినిమాను పూర్తిగా తన చేతుల్లో ఉంచుకుంటాడని ఓ టాక్ ఉండేది. ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా ఆయన సీన్స్ కోసం నటి నటులపై ఒక్కోసారి తీవ్ర స్థాయిలో ఆగ్రహించేవారట. ఇంకా కోపం తట్టుకోలేకపోతే కొంతమంది హీరోయిన్లను కొట్టేశాడు కూడా. అలాగే ఆ మధ్యలో ఓ ఇంటర్వ్యూలో తేజా సిన్ మంచిగా రావాలంటే కత్తితో నిజంగా పొడవడానికి కి కూడా వెనుకాడనని చెప్పాడు. అప్పట్లో ఆ వార్త సెన్సేషన్ అయ్యింది.

రీసెంట్ గా తేజ తెరకెక్కించిన “నేనే రాజు నేనే మంత్రి” సినిమాలో సెకండ్ హీరయిన్ గా మెరిసిన కథెరిన్ తేజ వ్యక్తిత్వం గురించి ఓ ప్రశ్నను ఎదుర్కొంది. తేజా గారు చాలా సీరియస్ దర్శకుడు అని సిన్ సరిగ్గా చేయకుంటే చాలా కోప్పడతారు లేదా కొడతారు అని అంటారు మీరు అలాంటి ఇబ్బందిని పేస్ చేయలేదా అన్ని ప్రశ్నకు కాథెరిన్ తనదైన శైలిలో స్పందించింది. ”అవును చాలా మంది నాతో ఇదే మాట అన్నారు. ఆయన చాలా కోపిష్టి అని తరువాత కన్నీళ్లు పెట్టుకోవడం ఖాయమని కొంత భయపెట్టారు. కానీ తేజ గారితో వర్క్ చేసినప్పుడు నాకు అలా ఏమి అనిపించలేదు. ఒకవేళ ఆయన మారిపోయి ఉండవచ్చు లేదా.. ఆయన స్థాయికి తగ్గట్టుగా కోపం తెప్పించకుండా నేను నటించానేమో అని అనుకుంటున్నా” అని చెప్పింది కాథెరిన్.

అంతే కాకుండా ఆయన చాలా టాలెంటెడ్ డైరెక్టర్ అని ప్రతి సినీ అర్థమయ్యేలా ఓ గురువులాగా టీచ్ చేశారని తేజాను పొగిడింది ఈ భామ. అయితే నేనే రాజు నేనే మంత్రి సినిమాలో ఈ అమ్మడి పాత్ర పరవాలేదనిపించిన చిత్రం మాత్రం మిశ్రమ టాక్ తెచ్చుకుంది.