గౌతమ్ నందాతో కేథరిన్ ఆశ తీరిపోనుందట!

0Catherine-Tresa-role-In-Gautamnandaమలయాళీ భామ కేథరిన్ థ్రెసా.. తెలుగులో పలు చిత్రాలలో నటించింది. అటు పెర్ఫామెన్స్.. ఇటు గ్లామర్.. రెండింటికీ ఇంపార్టెన్స్ ఉండేలా కేరక్టర్స్ ఎంచుకునే ఈ బ్యూటీ.. ఇప్పటివరకూ తన స్థాయిలో గ్లామర్ అవతారాన్ని చూపించలేదని అంటోంది. అయితే.. ఆ లోటు ఇప్పుడు రిలీజ్ కానున్న గౌతమ్ నంద చిత్రంతో తీరిపోనుందట.

మాస్ జనాలను మెప్పించడంలో దిట్ట అయిన డైరెక్టర్ సంపత్ నంది.. తాను పోషించిన ముగ్ధ పాత్రను అద్భుతంగా తెరకెక్కించాడని అంటోంది కేథరిన్. ఓ పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఈ ముగ్ధ రోల్.. తన కెరీర్ బెస్ట్ లో ఒకటిగా నిలవనుందని నమ్మకంగా చెప్పేస్తోంది. అసలు గౌతమ్ నంద కథే అందరినీ మెప్పిస్తుందని.. భాషా బేధం లేకుండా ఎవరినైనా ఆకట్టుకోగలిగే కాన్సెప్ట్ అన్నది కేథరిన్ మాట. ఎక్కువ భాగం షూటింగ్ థాయ్ ల్యాండ్ అబుదాబిలలో జరగగా.. షూటింగ్ స్పాట్ లో హీరో గోపీచంద్ సాయాన్ని మర్చిపోలేనని చెబుతోంది.

అంతటి సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న హీరోను తాను ఇప్పటివరకూ చూడలేదన్న కేథరిన్ థ్రెసా.. ఇప్పటివరకూ తాను ఎన్నడూ పోషించనంతటి గ్లామర్ రోల్ లో గౌతమ్ నందా మూవీలో కనిపించనున్నట్లు చెప్పింది. ఓ డ్రైవింగ్ సీక్వెన్స్ పిక్చరైజ్ చేస్తున్నపుడు.. గోపీచంద్ లో ఎంతటి ట్యాలెంటెడ్ డ్రైవర్ ఉన్నాడనే విషయం కూడా తెలిసిందట.