కేథరిన్ హైదరాబాదులో సెటిలైంది

0కేథరిన్ థ్రెసా మెయిన్ రోల్ సినిమాలు ఫ్లాఫ్ అయినా… ఆమె మంచి పాత్రలు చేసిన సినిమాలు మాత్రం బానే హిట్టయ్యాయి. రుద్రమదేవి – సరైనోడు – నేనేరాజు నేనే మంత్రి వంటి సినిమాలతో హిట్స్ రుచి చూసిన కేథరిన్ థ్రెసా కూడా హైదరాబాద్ లో ఇల్లుకొని సెటిలైన జాబితాలో చేరింది. ఈ హాట్ బ్యూటీ త్వరలో హైదరాబాదులో సొంతింట్లో గృహ ప్రవేశం చేయనుందట.

ఈ మధ్య ఫిల్మ్ నగర్ నుంచి సెలబ్రిటీలు మణికొండకు – గచ్చిబౌలికి – ఓఆర్ ఆర్ కు మారుతున్నారు. తాజాగా కేథరిన్ థ్రెసా కూడా ఓఆర్ ఆర్ సమీపంలో ఓ ఇల్లు కొనేశారట. సౌత్ ఇండియాలో కొన్ని మంచి ఆఫర్లు రావడంతో హైదరాబాదులో అద్దె ఇంట్లో ఉంటూ అన్నిటికీ హాజరవుతోంది. అయితే ఇక్కడ ఎక్కువ కాలం నుంచి ఉండటం – ఆఫర్లు ఇక్కడే ఉండటం – హైదరాబాద్ అన్ని విధాలా బెస్ట్ డెస్టినేషన్ కావడంతో ఇక్కడే ఒక ఇల్లు ఉంటే బాగుంటుందని భావించి కోకాపేటలో డూప్లెక్స్ ఇల్లు కొనేసిందట. అయితే ఇంకా సరైన ముహుర్తం కోసం వేచి చూస్తోంది. ఆషాడం కావడంతో ఈ నెల అనంతరం మంచి రోజు చూసి గృహ ప్రవేశం చేయాలని భావిస్తోందట.

ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా – మళయాళంలో ఒక సినిమాలో నటిస్తున్న కేథరిన్ ప్రస్తుతం చెన్నై షూటింగుల్లో బిజీగా ఉన్నా.. ఇక్కడ ఓ రెండు సినిమాలు ప్రపోజల్స్ ఉండటంతో ఇక్కడే ఇల్లు చూసుకున్నారు. ఆల్ ద బెస్ట్ కేథరిన్.