కేథరిన్‌తో హీరో రవితేజ రొమాన్స్..!

0catherine-tresa-to-team-up-with-ravi-tejaటాలీవుడ్ యాక్టర్ రవితేజ తమిళ్ సూపర్ హిట్ మూవీ బోగన్‌ను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అరవింద్‌స్వామి, జయం రవి, హన్సిక కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రానికి లక్ష్మణ్ దర్శకత్వం వహించాడు. తాజాగా రవితేజ రీమేక్‌ మూవీకి సంబంధించి ఓ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది.

ఒరిజినల్ వెర్షన్‌లో హన్సిక పోషించిన పాత్రను తెలుగులో కేథరిన్ పోషిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. హన్సిక రోల్ కోసం చిత్ర యూనిట్ కేథరిన్‌ను ఫైనల్ చేయడంతో..ఈ అవకాశం రావడం పట్ల చాలా హ్యాపీగా ఉందట కేథరిన్. బోగన్ రీమేక్‌లో అరవింద్ స్వామి నటించేందుకు రెడీగా లేకపోవడంతో చిత్రయూనిట్ ఆ పాత్రకు తగిన యాక్టర్‌ను వెతికే పనిలో పడిందని టాక్.