ఒక రోజు నిరాహార దీక్ష చేయ‌నున్న చంద్రబాబు

0రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో కేంద్రం తీరుకి నిర‌స‌న‌గా ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఒక రోజు నిరాహార దీక్ష చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. గుంటూరు జిల్లాలో జ‌రిగిన శాఖమూరులో జ‌రిగిన అంబేద్క‌ర్ జ‌యంతి వేడుక‌ల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… ఈ నెల 20న త‌న జ‌న్మ‌దినం అనీ, అదే రోజున నిరాహార దీక్ష చేయ‌బోతున్నానని ప్రకటించారు

పార్లమెంటును జరగనివ్వలేదని చెప్పి ప్రధాని మోదీ నిరాహారదీక్ష చేశారని… పార్లమెంటు జరగకపోవడానికి కారణం మీరే కదా? అని ఆయనను తాను అడుగుతున్నానని ఎద్దేవా చేశారు. తాను మాత్రం రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ దీక్ష చేయబోతున్నానని… తద్వారా కేంద్రం పట్ల నిరసన వ్యక్తం చేస్తానని తెలిపారు. ఢిల్లీని శాసించబోయేది టీడీపీనే అని… ఢిల్లీలో చక్రం తిప్పుతామని, 2019లో మనం మద్దతు ఇచ్చే పార్టీనే కేంద్రంలో అధికారంలోకి వస్తుందని అన్నారు చంద్రబాబు.